Turkey: పాకిస్తాన్‌కి బాంబులు, ఇండియాకేమో స్వీట్లు.. టర్కీ తీరుపై చర్చ

చాలా ఖరీదైన బక్లావా స్వీట్స్ టర్కీలో పుట్టాయి. కేజీ బక్లావా ధర వేలల్లో ఉన్నా ఇండియాలోనూ ఫుల్ డిమాండ్. టర్కీ నుంచి చెఫ్‌లను పిలిపించి ఈ స్వీట్లు తయారు చేయిస్తున్నాయి బేకరీలు. భారత్‌కేమో స్వీట్లు, పాకిస్తాన్‌కు బాంబులు ఇచ్చిందని విమర్శలు వస్తున్నాయి.

New Update
Baklava

అన్నం పెట్టినోడికి సున్నం పెట్టుడు సామెత ఉంది టర్కీ తీరు. భారీ భూకంపం వచ్చి చిన్నాభిన్నమైతే.. ఆపరేషన్ దోస్తే అనే పేరుతో భారత్ అత్యవసర సహాయం అందించింది. రెస్యూ టీంమ్స్ పంపించి వైద్య సహాయం చేసింది. మందులు, ఆహారం, NDRS టీంలను పంపించింది. అంత హెల్త్ చేసిన ఇండియాకి వెన్నుపోటు పొడిచింది టర్కీ. పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే.. భారత్ చేసిన సాయం మరిచి శత్రు దేశానికి ఆయుధాలు అందించింది. పాక్, భారత్ ఉద్రక్తత మధ్య పాకిస్తాన్‌కు టర్కీ మద్దతు ఇచ్చింది. క్షిపణులు, బాంబులు, ఆయుధాలు, యుద్ధ ట్యాంకర్లు సరఫరా చేసింది టర్కీ. అలాగే టర్కీ నుంచి మన దగ్గరకి కూడా కొన్ని వచ్చాయి. అవేంటో తెలుసా..?

Also read: పాకిస్తాన్ ఆర్మీకి నిద్రలేకుండా చేస్తున్న అందమైన అమ్మాయిలు.. వీళ్ల కథ ఇదే!

బక్లావా హిస్టరీ

టర్కీలో బక్లావా అనే స్వీట్ చాలా ఫేమస్. దానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. బక్లావాకి అన్నీ దేశాలతోపాటు భారత్‌లో కూడా లవర్స్ ఉన్నారు. ఆ స్వీట్ ఇండియన్ బేకరీలో దొరికే ఖరిదైన వంటకం. కేజీ బక్లావా స్వీట్‌కు వేలల్లో ధర ఉంటుంది. ఈ బక్లావా స్వీట్ డైవండ్, రోల్స్, బాక్స్ షేప్‌లో చేస్తారు. బక్లావా అనేది మంగోలియాన్ పదం నుంచి వచ్చినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. టర్కిష్‌లో దీని అర్థం కట్టడం, చుట్టడం, పోగు చేయడం. గ్రీక్, టర్కీ ప్రాంతాల్లో క్రీస్తుపూర్వం 8వ శతాబ్దం నుంచి బక్లావాను తయారు చేశారు. అస్సీరియన్, ఒట్టోమన్ సామ్రాజ్యాల సమయంలో ఈ స్వీట్ చాలా ఫేమస్. రాజులకు, గొప్పగొప్ప వ్యక్తులకు ఇచ్చే విందుల్లో బక్లావాను వడ్డించేవారు. ప్రాంతాలను బట్టి బక్లావా తయారీలో వాడే పదార్థాలు, టేస్ట్‌లో తేడాలు ఉంటాయి. 

పాక్‌కు బాంబులు, భారత్‌కు స్వీట్లు

బక్లావా తయారు చేయడానికి టర్కీ నుంచి చెఫ్‌లను ఇండియాకు పిలిపించుకుంటాయి ఇక్కడి బేకరీలు. పెద్ద పెద్ద బేకరీల్లో బక్లావాకి మంచి డిమాండ్ ఉంది. ఇలా టర్కీ పాకిస్తాన్‌కు బాంబులు, క్షిపణులు ఇస్తూ.. మనకు మాత్రం స్వీట్లు ఇస్తోంది. దీనిపై కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మొన్నటి వరకు బైకాట్ టర్కీ అని హ్యాష్ ట్యాక్ కూడా విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు ఈ బక్లావ్ స్వీట్లు కూడా తీనే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉండొచ్చు. 

baklava sweets | turkey | boycott turkey | demand to ban turkey | india turkey | turkey aid pakistan | Turkey arms to Pakistan | turkey support pakistan | turkey pak ties | turkey with pakistan | latest-telugu-news

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు