Covid-19: కరోనా కలకలం.. 6 వేలు దాటిన కేసులు, 65 మంది మృతి
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 6 వేలు దాటింది. ఇప్పటిదాకా కరోనాతో దేశవ్యాప్తంగా 65 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 6 వేలు దాటింది. ఇప్పటిదాకా కరోనాతో దేశవ్యాప్తంగా 65 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
పిల్లలకి జ్వరం, దగ్గు, గొంతునొప్పి, అలసట వంటి లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాధితో పోరాడటానికి శరీరానికి తగినంత విశ్రాంతితోపాటు నీరు, కొబ్బరి నీళ్లు, సూప్, పోషకమైన ఆహారం పెట్టాలి. మాస్క్‌లు ధరించాలి, చేతులు కడుక్కోవాలని నిపుణులు చెబుతున్నారు.
తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పటికే ఏపీలో 2 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో ఒకటి, కడపలో మరోకరికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది.
కబీర్ సింగ్, జ్యువెల్ థీఫ్ చిత్రాలతో పాపులరైన బాలీవుడ్ నటి నికితా దత్తా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని నికిత తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తనకు మాత్రమే కాకుండా తన తల్లికి కూడా వైరస్ సోకినట్లు చెప్పారు. ఈమేరకు అందరు సురక్షితంగా ఉండండి అంటూ పోస్ట్ పెట్టారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కొత్త రూపంలో కోరలు చాస్తోంది. మళ్లీ ప్రపంచమంతా విస్తరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పలు దేశాల్లో కేసులు పెరుగుతుండగా తాజాగా ఇండియాలో కూడా కేసులు పెరుగుతున్నాయి.
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జూన్ 24 నుంచి జులై 21 మధ్య 85 దేశాల్లో ప్రతీవారం 17, 358 కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. భారత్‌లో కూడా జూన్ నుంచి జులై మధ్య 908 మందికి కరోనా సోకింది.
రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కొంతకాలం క్రితం వ్యర్థ నీటిలో కొవిడ్ ఆనవాళ్లను గుర్తించారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ నివేదికలో వెల్లడించింది. దీనికి ‘ఫ్లిర్ట్’ అని పేరు పెట్టారు.
మహారాష్ట్రలో కొత్తగా 19 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. దీంతో ఇటీవల కాలంలో మొత్తం 91 కరోనా కేసులు రికార్డు అయినట్టు తెలుస్తోంది. కొత్త కోవిడ్-19 ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ KP.2 ఇప్పుడు వ్యాప్తి చెందుతోంది. అయితే, దీని విషయంలో ఆందోళన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు.