/rtv/media/media_files/2025/06/11/gyap4JxbhgvSrGQ3NVG2.jpg)
Dowry Case in Bihar
భారతదేశాన్ని వరకట్న సమస్య ఇంకా పీడిస్తూనే ఉంది. చదువుకున్న వారు, చదువులేని వారు కూడా డబ్బుల కోసం కోడళ్ళను పీడిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటివరకు వరకట్నంగా డబ్బలు, బంగారం, భూములు ఇలాంటి అడగడం అందరికీ తెలుసు. కానీ బిహార్‌లోని ముజఫర్‌పుర్ జిల్లా మిఠన్‌పురాకు చెందిన ఓ కుటుంబం వీటన్నింటినీ దాటేసింది. ఏకంగా కిడ్నీనే కట్నంగా అడిగింది. వివరాల్లోకి వెళితే..
Also Read : ప్రజాస్వామ్యానికి మనం తల్లైతే.. పాకిస్తాన్ ఉగ్రవాదానికి తండ్రి
Also Read : నేను లేకపోతే లాస్ ఏంజెలెస్ తగలడిపోయేది..ట్రంప్
ఓరినీ ఇలా కూడా అడుగుతారా..
బిహార్‌లోని ముజఫర్‌పుర్ జిల్లా మిఠన్‌పురాకు చెందిన దీప్తికి బోచహాన్ ప్రాంత యువకుడితో 2021లో పెళ్ళయింది. పెళ్ళయిన కొత్తలో అంతా బాగానే ఉంది. కానీ ఆ తరువాత నుంచి దీప్తికి అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. వారు ఆమెను అదనపు కట్నంగా డబ్బులు, బైక్ ఇవ్వాలని వేధించడం మొదలుపెట్టారు. వాటి కోసం దీప్తిని బాధలు పెట్టేవారు. అన్నీ ఓర్చుకుంటూ వస్తున్న దీప్తికి ఈ క్రమంలో మరో కష్టం ఎదురైంది. ఆమె భర్తకు కిడ్నీల్లో ఒకటి పాడయింది. అందుకని దీప్తిని అదనపు కట్నంగా ఒక కిడ్నీని ఇవ్వాలని అత్తమామలు వేధించడం ఒత్తిడి పెంచారు.కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరిస్తోందంటూ భర్త, అత్తామామలు ఆమెను చావబాది ఇంటి నుంచి గెంటేశారు.
దీంతో విసిగిపోయిన దీప్తి పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడ పోలీస్ స్టేషన్ లో అత్తమామల మీద ఫిర్యాదు చేసింది. రాజీ యత్నాలు ఫలించకపోవడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో దీప్తి భర్త, అత్తామామలు సహా మొత్తం నలుగురిని నిందితులుగా చేర్చారు.
Also Read : ఏసీల వాడకంపై కేంద్రం కొత్త రూల్
Also Read : కాళేశ్వరం విచారణ.. ఛలో BRK భవన్‌కు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే..
bihar | kidney | today-latest-news-in-telugu | Dowry Case | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | telugu-news
Follow Us