Karnataka:హిజాబ్ గొడవలను మళ్ళీ తెర మీదకు తీసుకువస్తున్న కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ
ముస్లిమ్ అమ్మాయిలు హిజాబ్ ధరించడం మీద కర్ణాటకలో ఎంత పెద్ద గొడవ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఆ గొడవను తెర మీదకు తీసుకువస్తోంది కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ. నియామక పరీక్షలకు హాజరయ్యేవారు తలను పూర్తిగా కప్పేలా దుస్తులు ధరించకూడదని నిషేధం విధించింది.