/rtv/media/media_files/2025/09/02/kavitha-2025-09-02-06-43-31.jpg)
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) సంచలనంగా మారారు. ఏకంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) పైనే ఆమె కీలక కామెంట్స్ చేశారు. హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పెద్ద అవినీతి కొండలని కవిత నిన్న ప్రెస్ మీట్ లో హాట్ కామెంట్స్ చేశారు. వారు చేసిన పనుల వల్ల కేసీఆర్ అప్రతిష్టపాలయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణల వెనుక వీరిద్దరూ ఉన్నారని, తన తండ్రి కేసీఆర్‌కు చెడ్డ పేరు తీసుకురావడానికి వారే కారణమని ఆమె మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆయనపై సీబీఐ విచారణ చేపట్టే పరిస్థితి రావడం తనను ఆవేదనకు గురి చేసిందని కవిత వాపోయారు. హరీష్ రావు, సంతోష్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని కాకుండా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తుందని కవిత ఆరోపించారు. కేసీఆర్‌పై అవినీతి ముద్ర పడటం చూసి తన గుండె మండిపోతోందని కవిత కన్నీరు పెట్టుకున్నారు. తన తండ్రి డబ్బు వెనకాల పరుగెత్తలేదని, ప్రజల కోసమే పనిచేశారని ఆమె తెలిపారు.
Also Read : Trump: భారత్ ఆలస్యం చేసింది.. టారిఫ్‌లపై ట్రంప్ సంచలన ప్రకటన
అయితే కవిత చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. దీంతో ఆమెపై కేసీఆర్ గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కవిత తీరుతో పార్టీకి మరింత నష్టం జరిగేలోపు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నుంచి కవిత సస్పెషన్ ఖాయమనే వార్తలు బీఆర్ఎస్(brs) వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కవితను సస్పెండ్ చేయాలని మోజారిటీ నేతలు కేసీఆర్ కు సూచించినట్లుగా సమాచారం. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో దీనిపైనే ప్రధాన చర్చ జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.
Also Read : BIG BREAKING: హరీశ్ రావుకు KTR సపోర్ట్.. వీడియోతో సంచలన ట్వీట్
ఏం చేయబోతున్నారు?
బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేస్తే ఆమె ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే మొదటినుంచి ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్తే కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ జాగృతి పేరుతోనే ఆమె కొత్త పార్టీని పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తైనట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చాక ఆమె కొత్త పార్టీ పేరు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇదిలా ఉంటే కవిత వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. హరీష్ రావుకు మద్దతుగా "ఆరడుగుల బుల్లెట్" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. పార్టీ మీడియా గ్రూపుల నుండి కవిత పీఆర్వోను తొలగించడం ద్వారా ఆమెకు షాక్ ఇచ్చింది..
Also Read : Weather Update: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు!