Chandra Grahan 2025: విచిత్రం.. చంద్ర గ్రహణాన్ని ఈ 15 నగరాల్లో స్పష్టంగా చూడొచ్చు..!

సెప్టెంబర్ 7న సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలోని కొన్ని నగరాల్లో కనిపిస్తుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే,లక్నో, జైపూర్, చండీగఢ్, అహ్మదాబాద్, గౌహతి,పాట్నా, భోపాల్, భువనేశ్వర్ వంటి నగరాల్లోలలో స్పష్టంగా కనిపిస్తుంది.

New Update
Chandra Grahan 2025

Chandra Grahan 2025 full information

చంద్ర గ్రహణం అనేది ఒక ఖగోళ సంఘటన. ఇది చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు సంభవిస్తుంది. ఈ సమయంలో భూమి సూర్యుని నుండి వచ్చే కాంతిని అడ్డుకుంటుంది. దానివల్ల చంద్రుడిపై నీడ పడుతుంది. దీని ఫలితంగా భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు లేదా ఎరుపు రంగులో కనిపిస్తాడు. అయితే ఇదంతా పౌర్ణమి రోజున మాత్రమే జరుగుతుంది. కాగా ఈ ఏడాదిలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7-8 రాత్రి సంభవిస్తుంది. 

Also Read:కవితకు షాక్.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్

ఇంతక ముందు మొదటి చంద్ర గ్రహణం మార్చి 14న ఏర్పడింది. ఈ గ్రహణం ఉదయం 10:40 గంటల నుండి మధ్యాహ్నం 2:18 గంటల వరకు అంటే దాదాపు 3 గంటల 38 నిమిషాల పాటు సంభవించింది. ఇక ఇప్పుడు రెండవ చంద్రగ్రహణం ఈ నెలలో రాబోతుంది. ఇది సెప్టెంబర్ 7న రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 1:26 గంటల వరకు ఉంటుంది. 

Also Read:ముఖ్య అతిథులుగా ముస్లింలు.. 35 ఏళ్ల తర్వాత పురాతన ఆలయాన్ని తెరిచిన కశ్మీరీ పండితులు

అయితే సంపూర్ణ గ్రహణం మాత్రం రాత్రి 11:42 గంటల నుండి 12:47 గంటల వరకు ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడు భూమి నీడలో పూర్తిగా ఉంటాడు. సంపూర్ణ గ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారతాడు. ఇదంతా దాదాపు 65 నిమిషాల పాటు కనిపిస్తుంది. కాగా భారతదేశంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని స్పష్టంగా చూడాలనుకుంటున్నారా?.. అయితే వాతావరణం సరిగ్గా ఉంటే ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని దాదాపు 15 నగరాల్లో క్లారిటీగా చూడొచ్చు. 

15 నగరాల్లో స్పష్టంగా చంద్రగ్రహణం

వాతావరణం స్పష్టంగా ఉంటే భారతదేశంలోని 15 నగరాల్లో అంటే.. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, లక్నో, జైపూర్, చండీగఢ్, అహ్మదాబాద్, గౌహతి, పాట్నా, భోపాల్, భువనేశ్వర్ వంటి నగరాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా తూర్పు, పశ్చిమ భారతదేశంలోని 4 నగరాల్లో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అందులో తూర్పు భారతదేశంలోని కోల్‌కతా, గౌహతి వంటి నగరాల్లో చంద్రోదయం ప్రారంభమవడం వల్ల గ్రహణం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో ముంబై, అహ్మదాబాద్ వంటి పశ్చిమ భారతదేశంలో కూడా గ్రహణం పూర్తి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అక్కడ చంద్రోదయ సమయం కొంచెం ఆలస్యంగా ఉంటుంది. 

Also Read: నన్నెవరేం పీకలేరు..బ్రొంకో టెస్ట్ లో రోహిత్ పాస్

సుతక్ కాల్ సమయం

సుతక్ కాల్ అనేది హిందూ జ్యోతిష్యం, సంప్రదాయాల ప్రకారం.. గ్రహణం ప్రారంభం కావడానికి ముందు ఉండే ఒక అశుభ సమయం. ఈ సమయంలో కొన్ని శుభ కార్యాలు, పూజలు, ముఖ్యమైన పనులు చేయకూడదని నమ్ముతారు. గ్రహణం సమయంలో విశ్వంలో ప్రతికూల శక్తి ప్రభావం ఉంటుందని, కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెప్తారు. చంద్ర గ్రహణం సంభవించడానికి 9 గంటల ముందు సుతక్ కాల్ ప్రారంభమవుతుంది. 

ఈ సుతక్ కాల్ సమయంలో దేవాలయాల తలుపులు మూసివేస్తారు. భక్తులు విగ్రహాలను తాకడం, పూజలు చేయడం లేదా ఆలయ ప్రవేశం చేయడం నిషేధం. సుతక్ సమయంలో ఆహారం తినడం, వండడం లేదా నీరు తాగడం మానుకుంటారు. ఆహార పదార్థాలపై తులసి ఆకులను ఉంచడం వల్ల వాటిపై గ్రహణ ప్రభావం పడదని నమ్ముతారు. వివాహం, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలను ఈ సమయంలో నిర్వహించరు. 

Also Read:పాక్ తో వ్యాపారం కోసం భారత్ తో గొడవలు..ట్రంప్ పై దుమ్మెత్తిపోసిన అమెరికా మాజీ ఎన్‌ఎస్‌ఏ జేక్ సుల్లివన్

మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు వెళ్లడం మానుకుంటారు. గ్రహణ ప్రభావం వల్ల పుట్టబోయే బిడ్డపై ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రజలు నమ్ముతారు. అదే సమయంలో పచ్చళ్ళు, ఆవకాయలు వంటి నిల్వ ఉండే ఆహార పదార్థాలపై గ్రహణం ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. గ్రహణం ముగిసిన తర్వాత సుతక్ కాలం కూడా ముగుస్తుంది. సుతక్ కాల్ సెప్టెంబర్ 7న మధ్యాహ్నం 12:57 నుండి గ్రహణం ముగిసే వరకు అంటే సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది. గ్రహణం తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని, స్నానం చేసి, దేవుడికి పూజలు చేసుకోవచ్చు.

ప్రధాన దేవాలయాలు క్లోజ్

సుతక్ కాల్ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని తిరుపతి బాలాజీ ఆలయం, ఒడిశాలోని పూరిలోని జగన్నాథ ఆలయం, ఉత్తరప్రదేశ్‌లోని కాశీలోని విశ్వనాథ ఆలయం మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేస్తారు. 

తెరిచి ఉండే దేవాలయాలు

కొన్ని ప్రత్యేక నమ్మకాల కారణంగా.. కొన్ని ఆలయాలు సూతక కాలంలో తెరిచి ఉంటాయి. వీటిలో బీహార్‌లోని గయలోని విష్ణుపాద ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయంపై గ్రహణం ప్రభావం ఉండదని నమ్ముతారు. కాబట్టి సూతక కాలంలో ఆలయ తలుపులు తెరిచే ఉంటాయి. అదేవిధంగా రాజస్థాన్‌లోని బికనీర్‌లోని లక్ష్మీనాథ్ ఆలయం, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాళ ఆలయం కూడా సూతక కాలంలో తెరిచే ఉంచుతారు. 

Advertisment
తాజా కథనాలు