Weather Update: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ పొంచి ఉన్న గండం.. వచ్చే నెల నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!

మళ్లీ వాయవ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఐదో తేదీకి ఇది వాయుగుండంగా మారుతుంది. దీంతో ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

New Update
Rains

Rains

గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అయితే వరుణ దేవుడు బీభత్సం చూపించాడు. తీవ్ర స్థాయిలో వర్షపాతం నమోదైంది. రోజంతా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, ఇళ్లు, వాహనాలు నాశనమయ్యాయి. అయితే మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 3వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఐదో తేదీకి ఇది వాయుగుండంగా మారుతుంది. దీంతో ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మళ్లీ తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. 

ఇది కూడా చూడండి: Heavy Rain In Hyderabad : హైదరాబాద్‌లో కుండపోత వర్షం..ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్

ఈ జిల్లాలకు మళ్లీ రెడ్ అలర్ట్..

ఇటీవల కామారెడ్డి, మెదక్ జిల్లాలో వచ్చిన భారీ వర్షాలకు అతలాకుతలమైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ కొన్నిచోట్లు భారీ వర్షాలు కురుస్తున్నాయి. మళ్లీ ఇంతలోనే భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు మళ్లీ ఉండటంతో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ఈ మధ్య కూడా పలు  జిల్లా్ల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కొత్తగూడెం, హన్మకొండ, ఆదిలాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, మహబూబాబాబ్, మెదక్, ములుగు, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, వరంగల్, రాజన్న సిరిసిల్లలో వర్షాలు కురుస్తాయని నిపుణులు అంటున్నారు. గంటకు 30- నుంచి 40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

ఇది కూడా చూడండి: Pocharam Dam : భారీ వరదల తాకిడిని తట్టుకుని నిలబడ్డ వందేండ్ల పోచారం ప్రాజెక్ట్‌

ఈ జిల్లాల్లో వర్షాలు..

ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కడపలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని తెలిపారు. ముఖ్యంగా వేటకు వేళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల వారు అయితే తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు