/rtv/media/media_files/2025/04/24/iWZfadLJXG7pFy2GtIyP.jpg)
pahalgam attack
పహల్గాంలో పర్యాటకుల పై ఉగ్రదాడి తరువాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు,అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి.ఈ క్రమంలోనే వారి ఇళ్లను వెతికి వాటిని ధ్వంసం చేస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి ఐదుగురు ఉగ్రవాదుల నివాసాలను పేల్చేశాయి.
Also Read: AP Crime: పల్నాడులో ప్రైవేట్ బస్సు బోల్తా.. స్పాట్‌లోనే ఐదుగురికి..
షోపియాన్ లోని చోటిపొరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశాయి. ఇతడు గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఉగ్ర సంబంధిత కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని అధికారులు వెల్లడించారు.
Also Read: Pahalgam attack : హ్యాట్సాఫ్..ఉగ్రదాడితో ముస్లిం ఆవేదన.. ఇస్లాంను వదిలేస్తూ కోర్టుకు!
కుల్గాంలోని మతాలం ప్రాంతంలో మరో యాక్టివ్ టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ నివాసాన్ని ధ్వంసం చేశారు.ఇదే జిల్లాలో లష్కరేకు చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశారు.2023 జూన్ నుంచి ఇతడు దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించారు.
కుల్గాంలోని ముర్రాన్ ప్రాంతంలో ఉగ్రవాది అహ్‌సన్ ఉల్ హక్ ఇంటిని బాంబులతో కూల్చారు. అహ్‌సన్ 2018లో పాక్ వెళ్లి ఉగ్ర శిక్షణ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.ఆ తరువాత కశ్మీర్ లోయలోకి తిరిగి వచ్చి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిఘా ఏజెన్సీలు పేర్కొన్నాయి.
పూల్వామాలోని కాచిపోరా పరాంతంలో హరీస్ అహ్మద్ అనే ముష్కరుడి ఇంటిని బాంబులతో కూలగొట్టారు.ఇతడు కూడా 2023 నుంచిలష్కరే తరుఫున యాక్టివ్ గా పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరందరి పైనా ఇప్పటికే కేసులు నమోదైనట్లు సమాచారం.
కాగా..పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరుల్లో ఒకడైన ఆదిల్ హుస్సెన్,మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లు నేలమట్టమైన సంగతి తెలిసిందే.వేర్వేరు పేలుడు ఘటనల్లో ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు.వారి ఇళ్లలో అప్పటికే బాంబులు అమర్చి ఉన్నాయని,పోలీసు బలగాలను ట్రాప్ చేయడం కోసమే వాటిని యాక్టివేట్ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Also Read:TGSRTC: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్ ఆర్టీసీ!
Also Read: BIG BREAKING: ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణ.. పాక్ సంచలన డిమాండ్!
attack in Pahalgam | breaking news pahalgam | jammu-kashmir | terrorists | latest-news | latest-telugu-news | latest telugu news update