FlipKart: వారంలో ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందే... ప్రముఖ ఈ కామర్స్ సంస్థ సంచలన నిర్ణయం!
ప్రముఖ దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తమ ఉద్యోగుల పని విధానంలో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న హైబ్రిడ్ వర్క్ మోడల్‌కు బైబై చెబుతూ, ఉద్యోగులందరూ వారానికి ఐదు రోజులు తప్పనిసరిగా ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేసింది.