/rtv/media/media_files/2025/04/17/yCYsWtCHJJyCvsyL7HVG.jpg)
Narendra Modi
Narendra Modi Tour : ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. గతంలో కూడా మోదీ ఏపీకి వచ్చినా.. ఈసారి మాత్రం ఇది స్పెషల్ టూర్. అమరావతి పునర్నిర్మాణం కోసం ఆయన ఈసారి ఏపీకి వస్తున్నారు. 2014లో ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక, ఇలాగే అమరావతి నిర్మాణం కోసం ఆయన వచ్చి వెళ్లారు. ఇప్పుడు రెండోసారి పునర్నిర్మాణం అంటూ రాబోతున్నారు. మే నెల 2 వతేదీ మోదీ ఏపీకి వస్తారు. అమరావతిలో ఆయన బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభ వేదికపైనుంచి ఆయన అమరావతి పునర్నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తారు. ఈ మేరకు పీఎంవో షెడ్యూల్‌ను ఖరారు చేసింది. నరేంద్ర మోదీ మే 2న ఢిల్లీ నుంచి బయల్దేరి గన్నవరం విమానాశ్రాయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి అమరావతికి చేరుకుని.. సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ హాజరయ్యే కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభను ప్లాన్ చేసింది ప్రభుత్వం.
Also Read : అఘోరీ ముల్లు లేని మగాడు.. ఆ పార్ట్ ఎందుకు లేదో మొత్తం చెప్పేసిన అన్వేష్!
ప్రధాని మోదీ హాజరయ్యే అమరావతి పనుల శంకుస్థాపన కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం.. అమరావతి సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఇప్పటికే ఎంపిక చేసింది. అక్కడి నుంచే పనులు పునః ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి, బహిరంగ సభకు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా నియమించగా.. ఎస్పీజీ బృందం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.ఈ సభలో ఆయనతోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, లోకేష్ సహా ఇతర కీలక నేతలు ఉంటారు. కూటమి ప్రతినిధిగా ప్రధాని వస్తున్నారు కాబట్టి.. మూడు పార్టీల నేతలకు అక్కడ ప్రయారిటీ ఉంటుంది.
Also Read: bihar fire accident: ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు పిల్లలు మృతి
మరోవైపు అమరావతి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి5 లక్షల మంది హాజరవుతారనే అంచనాతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించి నోడల్ అధికారిగా వీరపాండ్యన్ ఉన్నారు.. ఈ మేరకు సీఎస్ విజయానంద్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రోడ్లను గుర్తించారు. ఆయా రోడ్లపై ఎక్కడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో నిర్మాణాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది.. ఈ మేరకు ఇప్పటికే కొన్ని టెండర్లను కూడా ఖరారు చేశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పనుల్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తే బావుంటుందని ఆలోచించారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు అమరావతి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వాలని ప్రధానిని కోరారు.. మోదీ సానుకూలంగా స్పందించడంతో షెడ్యూల్ ఖరారైంది.
Also Read: Combination Drugs: 35 రకాల ఔషదాలు నిషేధించిన కేంద్రం