/rtv/media/media_files/2025/08/24/extended-working-hours-2025-08-24-20-49-00.jpg)
Extended Working Hours Will Harm Health, Work-Life Balance, Feel 44% Respondents
ఇటీవల ఇన్ఫోసిస్(Infosys) కో ఫోండర్ నారాయణమూర్తి వారానికి 70 గంటలు పనిచేయాలని, ఎల్ అండ్ టీ(L&T) ఛైర్మన్ ఎస్.ఎన్ సుబ్రహ్మణ్యం వారానికి 90 గంటలు పనిచేయాలని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే చాలామంది తీవ్రంగా విమర్శలు చేశారు. పనిగంటల పొడిగింపు అంశంపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి జీనియస్ డిజిపోల్ అనే మానవ వనరుల కన్సల్టెన్సీ ఓ సర్వే నిర్వహించింది. అదనపు పనిగంటలపై ఉద్యోగులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారనే విషయాలు వెల్లడించింది.
Also Read: తమిళనాడులో డీఎంకే వర్సెస్ టీఎంకే..అంకుల్..బ్రో అంటూ పోస్టర్ వార్..
Extended Working Hours
ఎలాంటి అదనపు ప్రయోజనాలు, సౌలభ్యాలు లేకుండా పనిగంటలు పొడిగించడం అనేదానిపై చాలామంది ఉద్యోగులు వ్యతిరేక చూపినట్లు ఈ నివేదిక వెల్లడించింది. అదనపు పనిగంటలు వ్యక్తిగత సమయం, ఆరోగ్యంతో పాటు వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సర్వేలో పాల్గొన్న 44 శాతం తెలిపారు. జీనియస్ డిజిపోల్ HR కన్సల్టెన్సీ జులై 1 నుంచి 31వ తేదీ మధ్య ఆన్‌లైన్‌లో ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో 2076 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సర్వేలో ఎక్కువమంది ఉద్యోగులు అదనపు పనిగంటల వల్ల వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు.
Also Read: నోయిడా కేసులో బిగ్ ట్విస్ట్.. వరకట్న మర్డర్ నిందితునిపై పోలీసుల కాల్పులు
సరైన ప్రయోజనాలు, పరిహారం అందిస్తే అదనపు పనిగంటలు చేసేందుకు సిద్ధమని ఈ సర్వేలో పాల్గొన్న 40 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో 16 శాతం మంది ఈ విధానాన్ని ప్రయత్నించేందుకు సిద్ధంగా ఉన్నామని లేదా కంపెనీ ఉత్పాదకత పెంచేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. అయితే పని గంటలకు సంబంధించి విధానపరంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఉద్యోగుల్లో స్పష్టమైన వైఖరి ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఈ సంప్రదింపుల్లో తమకు కూడా భాగస్వామ్యం ఉండాలని 79 శాతం మంది ఉద్యోగులు చెప్పారు. అలాంటి చర్చలు బహిరంగంగా, పారదర్శకంగా జరగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Also Read: అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ.. రూ.2929 కోట్ల బ్యాంక్ మోసం కేసులో సీబీఐ సోదాలు
ప్రస్తుత ఉద్యోగులు పనివిధానంలో మార్పునకు వ్యతిరేకంగా లేరని జీనియస్ హెచ్‌ఆర్‌టెక్ తెలిపింది. నిష్పక్షపాత ఉండటం, ఆలోచనలు పంచుకోవడం, సంప్రదింపులు చేయడం లాంటివి కోరుకుంటున్నారని పేర్కొంది. ఆలోచనాపరమైన ప్లాన్ లేకుండా ఉద్యోగులను ఎక్కువ గంటలు పనిచేయించడం అనేది ఉద్యోగులు, యాజమాన్యాల మధ్య దూరాన్ని పెంచుతుందని చెప్పింది. సంస్థలో ఉత్పాదకత అనేది కేవలం ఉద్యోగులు ఇచ్చే సమయంపై కాకుండా వాళ్ల శక్తి యుక్తులపై ఆధారపడి ఉంటుందని కంపెనీలు గుర్తించాలని జీనియస్ హెచ్‌ఆర్‌టెక్ స్పష్టం చేసింది.
Also Read: వాషింగ్టన్ తరువాత షికాగో లో సైనిక మోహరింపు..ఆలోచనలో పెంటగాన్