Actor Vijay : తమిళనాడులో డీఎంకే వర్సెస్‌ టీఎంకే..అంకుల్‌..బ్రో అంటూ పోస్టర్ వార్‌..

తమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. డీఎంకే, టీవీకే పార్టీల మధ్య డైలాగ్‌ వార్‌ కాకా రేపుతోంది. అంకుల్‌, బ్రో అంటూ  రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలతో పోస్టర్లు వేసుకుంటున్నాయి. సీఎం స్టాలిన్‎ను విజయ్ అంకుల్ అనడంతో వివాదం చెలరేగింది.

New Update
Stalin vs Vijay

Stalin vs Vijay

Actor Vijay : తమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. డీఎంకే, టీవీకే పార్టీల మధ్య డైలాగ్‌ వార్‌ కాకా రేపుతోంది. అంకుల్‌, బ్రో అంటూ  రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలతో పోస్టర్లు వేసుకునే స్థాయికి ఆరోపణలు చేరుకున్నాయి. ఇటీవల టీవీకే పార్టీ ఆధ్వర్యంలో మానాడు పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభలో మాట్లాడిన విజయ్‌ తమిళనాడు సీం, డీఎంకే అధినేత స్టాలిన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. సీఎం స్టాలిన్‎ను ఉద్దేశించి అంకుల్ అంటూ విజయ్ వ్యంగ్యస్త్రాలు సంధించడంతో వివాదం రాజుకుంది. ఈ విషయంలో  డీఎంకే నేతలు ఫైర్ అవుతున్నారు. విజయ్‎కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోస్టర్లు వేశారు డీఎంకే నేతలు. ‘వాట్ బ్రో.. ఓవర్ బ్రో’ అంటూ పోస్టర్ల ద్వారా విజయ్‎కు కౌంటర్ ఇచ్చారు డీఎంకే నేతలు. డీఎంకే వర్సెస్ టీవీకే పోస్టర్ వార్‎తో తమిళనాడు రాజకీయలు వేడేక్కాయి.

Also Read: Rahul Gandhi: ఎవరు నచ్చకపోతే వాళ్ళను పంపేయొచ్చు..సీఎం, పీఎం 30 రోజుల జైలు బిల్లుపై రాహుల్ విమర్శ


విజయ్‌ ఏమన్నాడంటే..?

ఈ నెల 21న మధురైలో మానాడు పేరుతో టీవీకే భారీ బహిరంగ సభ నిర్వహించింది. విజయ్‌ పార్టీ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా నిర్వహించిన ఈ సభకు దాదాపు 4 లక్షల మంది హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో టీవీకే చీఫ్ విజయ్ అధికారపార్టీపై  విమర్శలు, డైలాగ్‎లు, పంచ్‎లతో అభిమానులు, కార్యకర్తలు ఉర్రూతలూగించారు. డీఎంకే అధినేత సీఎం స్టాలిన్‌పైనా విమర్శల వర్షం కురిపించారు. అదే సమయంలో అంకుల్‌ అంటూ వ్యంగ్యంగా సంభోదించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని.. మహిళలపై అఘాయిత్యాలు, నిరుద్యోగ సమస్య, లిక్కర్‌ స్కాం వంటి ఆరోపణలు ఉన్న డీఎంకే నేతలు మిస్టర్‌ క్లీన్‌ ఎలా అవుతారు.. ఇది కరెక్ట్ కాదు స్టాలిన్ అంకుల్ అంటూ ఘాటుగా విమర్శించారు.

అయితే స్టాలిన్‎ను విజయ్ వ్యంగ్యంగా అంకుల్ అనడంతో డీఎంకే నేతలు ఫైర్‌అయ్యారు. ఈ క్రమంలోనే విజయ్‎కు వ్యతిరేకంగా ‘వాట్ బ్రో, ఓవర్ బ్రో’ అంటూ రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు అంటిస్తున్నారు. దీంతో డీఎంకే, టీవీకే మధ్య పోస్టర్ వార్ మొదలయింది. అయితే టీవీకే సభకు పెద్ద సంఖ్యలో అభిమానులు రావడం చూసి రాజకీయ సభలో విజయ్ సినిమా డైలాగులు కొట్టారని,.. కానీ సినిమాలు, రాజకీయాలు వేర్వేరనే విషయం గుర్తించాలని వారంటున్నారు. విజయ్‎కు రాజకీయ పరిపక్వత లేదని విమర్శిస్తున్నారు. సీఎం స్టాలిన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. అయితే 2026లో తమిళనాడు అసెంబ్లీకి  ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారి విజయ్‌ పార్టీ టీవీకే పోటీ చేయనుంది. ఈ క్రమంలో  విజయమే లక్ష్యంగా ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.

Also Read: OG MOVIE: పవన్ 'OG'  నైజాం హక్కుల కోసం దిల్ రాజు భారీ ప్లాన్ ! అంత మొత్తం పెడుతున్నారా?

Advertisment
తాజా కథనాలు