Anil Ambani: అనిల్‌ అంబానీకి మరో ఎదురుదెబ్బ.. రూ.2929 కోట్ల బ్యాంక్ మోసం కేసులో సీబీఐ సోదాలు

రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి మరో బిగ్ షాక్ తగిలింది. రూ.2929 కోట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణం మోసం కేసులో అనిల్ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తెలిపింది.

New Update
Anil Ambani

Anil Ambani

Anil Ambani: రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి మరో బిగ్ షాక్ తగిలింది. రూ.2929 కోట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణం మోసం కేసులో అనిల్ అంబానీ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ విషయాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తెలిపింది. ఎస్‌బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ ముంబైలోని ఆర్‌కామ్ కార్యాలయం, సీ విండ్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. అయితే చాలా బ్యాంకులకు ఆర్‌కామ్ రూ.40 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. కేవలం ఎస్‌బీఐ రూ.2929 కోట్ల నష్టాన్ని చూసింది. మోసానికి పాల్పడటంతో అంబానీ, ఆర్‌కామ్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆర్‌కామ్‌కి రుణాలు కావాల్సి ఉండటంతో ఎస్‌బీఐని తప్పుదోవ పట్టించారు. రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ ద్వారా ఆర్‌కామ్ బిల్లులను తక్కువగా చూపించేవారు. అలాగే అమ్మకాల ఇన్‌వాయిస్‌పై రుణాల దుర్వినియోగం చేశారని సోదాలు నిర్వహించారు. 

ఇది కూడా చూడండి: SIP: సిప్‌లో ఇలా ఇన్వెస్ట్ చేస్తే.. కొన్నేళ్లలోనే మీరు కోటీశ్వరుడు కావడం ఖాయం!

మోసానికి పాల్పడటంతో..

2020లో జరిగిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక ప్రకారం రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ (RITL), రిలయన్స్ టెలికాం (RTL)లు బ్యాంకులకు మొత్తం రూ.31,580 కోట్లు అప్పుపడ్డాయి. ఈ రుణాలను సరిగా ఉపయోగించుకోలేదని ఆడిట్ ఆరోపించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో 44% (రూ.13,667.73 కోట్లు) బ్యాంకుల చెల్లింపులకు, 41% (రూ.12,692.31 కోట్లు) కనెక్టెడ్ పార్టీలకు వెళ్ళినట్లు నివేదిక పేర్కొంది. రూ.6,265.85 కోట్లను పాత బ్యాంకు అప్పులు తీర్చడానికి, రూ.5,501.56 కోట్లను సంబంధిత పార్టీల కోసం, రూ.1,883.08 కోట్లను పెట్టుబడుల కోసం ఉపయోగించారని ఆడిట్ తెలిపింది. ఇలా చాలా అక్రమ లావాదేవీలు జరిగాయని నివేదిక వెల్లడించింది. దీనిపై 2020 లో అనిల్ అంబానీ ఖాతాను మోసపూరితంగా ఎస్‌బీఐ బ్యాంకు తెలిపింది. ఆ తర్వాత 2021 లో ఎస్‌బీఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ కోర్టు తెలిపింది. అయితే మోసం చేసినట్లు ముందుగా చెప్పే ముందు రుణ గ్రహీతలకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ తన నిర్ణయాన్ని 2023లో వెనక్కి తీసుకుంది. మళ్లీ గతేడాది ఎస్‌బీఐ సీబీఐకి ఫిర్యాదు చేయడంతో సోదాలు నిర్వహించింది.

ఇది కూడా చూడండి: Stock Market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..బోనస్ షేర్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్న కంపెనీలు

Advertisment
తాజా కథనాలు