National Guards: వాషింగ్టన్ తరువాత షికాగో లో సైనిక మోహరింపు..ఆలోచనలో పెంటగాన్

వాషింగ్టన్ డీసీ అయిపోయింది ఇప్పుడు షికాగో...ట్రంప్ అణిచివేతకు ప్లాన్ మొదలైంది. డీసీలో నేరాలను, అక్రమ వలసలను ఆపేందుకు నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపిన ట్రంప్ ఇప్పుడు అదే పనిని షికాగో చేయడానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ లో మిలటరీ డిప్లాయ్ జరగనుంది.

New Update
Trump

Trump

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో అత్యవసర పరిస్థితి నెలకుందని అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. 
అక్కడ నేరాలు చాలా ఎక్కువ అయిపోయాయని..అందుకే నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపానని చెప్పారు.  దాంతో పాటూ మిలటరీ ఫోర్స్ ను తీసుకుని వచ్చారు. ట్రంప్ ఏకంగా 800 మంది నేషనల్ గార్డులను మోహరించారు. మొత్తం సిటీ అంతా సెక్యూరిటీతో నింపేశారు. దాంతో పాటూ  పబ్లిక్ సేఫ్టీ ఎమెర్జెన్సీని ప్రకటించారు. నేరాలను అరికట్టేందుకు అని చెబుతూనే వాషింగ్టన్ లో ఉన్న నిరాశ్రయులను కూడా బయటకు పంపించేస్తామని ట్రంప్ ప్రకటించారు. 
 వాషింగ్టన్‌లో దాదాపు 5,138 మంది నిరాశ్రయులైన పెద్దలు, పిల్లలు ఉన్నారు. వీరందరూ బయటకు వెళ్ళిపోవాలని ఆయన చెప్పారు. దీనిని వాషింగ్టన్ ప్రజలు నిరసించారు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేశారు.  చాలా రోజులు అక్కడ గొడవ అయింది. 

ఇప్పుడు షికాగోలో సైన్యం మోహరింపు..

ఇప్పడు వాషింగ్టన్ డీసీ తర్వాత షికాగో మీద పడ్డారు అమెరికా అధ్యక్షుటు ట్రంప్, పెంటగాన్ అధికారులు. అక్కడ నేరాలు, నిరాశ్రయులు, పత్రాలు లేని వలసదారులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. దీని కోసం వాషింగ్టన్ డీసీ మాదిరిగానే షికాగో లో కూడా నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపాలని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి పెంటగాన్ చర్యలను మొదలుపెట్టిందని వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. సెప్టెంబర్ లో ఈ గార్డ్స్ డిప్లాయ్ మెంట్ జరుగుతుందని తెలుస్తోంది. కొన్ని వేల మంది గార్డ్స్ ను అక్కడకు పంపించనున్నారని చెబుతున్నారు.  షికాగో  గందరగోళంగా ఉంది అని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేశారు. డెమొక్రాటిక్ రాజకీయ నాయకులు నడుపుతున్న నగరాల్లో నేరాలు, అక్రమ వలసలు ఎక్కువగా ఉన్నాయని...అక్కడ పాలకులు చూస్తూ ఊరుకుంటున్నారని అన్నారు.  మేము త్వరలోనే దాన్ని సరిదిద్దుతామని ట్రంప్ చెప్పారు.  అయితే షికాగో అధికారులు మాత్రం తమకు ఏ మాత్రం ఈ విషయం తెలియదని అంటున్నారు. తమతో నేషనల్ గార్డ్స్ మోహరింపు విషయం ఇంకా చర్చించలేదని చెప్పారు. డోనాల్డ్ ట్రంప్ సంక్షోభాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఇల్లినాయిస్ డెమొక్రాటిక్ గవర్నర్ జెబి ప్రిట్జ్‌కర్ అన్నారు. శ్రామిక కుటుంబాలను తాను పెడుతున్న బాధ నుంచి దృష్టి మరల్చడానికే ఇదంతా చేస్తున్నారని...అధికార దుర్వినియోగం చేస్తూనే ఉన్నారని విమర్శించారు. మరోవైపు షికాగోలో హత్యలు 30 శాతానికి పైగా తగ్గి, దొంగతనాలు 35 శాతం తగ్గాయి,కాల్పులు దాదాపు 40 శాతం తగ్గాయని ఆ సిటీ మేర్ బ్రాండన్ జాన్సన్ తెలిపారు. 

Also Read: Stock Market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..బోనస్ షేర్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్న కంపెనీలు

Advertisment
తాజా కథనాలు