/rtv/media/media_files/2025/05/05/rgOmXZNlajPrT5po033Q.jpg)
emergency meeting of the United Nations Security Council (UNSC) is being held today on the demand of Pakistan
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ కాళ్ల బేరానికి దిగింది. యుద్ధ భయంతో ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. సోమవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UNSC) అత్యవసర భేటీ నిర్వహించనుంది. ఈ సమావేశంలో భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలపై చర్చించనున్నారు. అయితే ఉద్రిక్తతలపై పాకిస్థాన్ క్లోజ్డ్ కన్సల్టేషన్ కోరింది. భారత్ చర్యలు శాంతి భద్రతలకు హాని కలిగిస్తున్నాయని ఆరోపించింది.
Also Read: వీడు భర్త కాదు బండరాయి.. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తినేశాడు వెధవ!
Emergency Meeting Of UNSC
భారత్ ఆంక్షలను UNSC దృష్టికి తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ పహల్గాం దాడిపై యూఎన్‌ఎస్సీ భారత్‌కు మద్దతిస్తోంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేదానిపై ఆసక్తి నెలకొంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఏ క్షణమైన యుద్ధం జరగొచ్చనే ప్రచారం నడుస్తోంది.
Also Read: కీలక అప్‌డేట్.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మరో టెర్రరిస్ట్ అరెస్టు
ఇదిలాఉండగా భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి కాల్పులు జరిగాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ ఈ దాడులకు పాల్పడింది. పూంఛ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బానీ, అఖ్నూర్, కుప్వారా, బారాముల్లా ప్రాంతాల్లో పాకిస్థాన్ ఈ దాడులు జరిగాయి. దీంతో వెంటనే స్పందించిన భారత భద్రతా బలగాలు పాకిస్థాన్ ఆర్మీ ప్లాన్‌ను తిప్పికొట్టాయి. దీంతో బార్డర్‌లో భారత సైన్యం మరింత మోహరించింది. కొత్తగా మరో 16 అదనపు బెటాలియన్లను రంగంలోకి దిగాయి.
Also Read: వాటిపై ఏకంగా 100% సుంకాలు.. మరో బాంబ్ పేల్చిన ట్రంప్!
Also Read: నీట్ పరీక్ష రాసిన 72 ఏళ్ల ముసలవ్వ.. చదువుకు వయసు అడ్డం కాదని నిరూపించింది
rtv-news | united-nations | national news in Telugu | international news in telugu | latest-telugu-news | today-news-in-telugu