/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
Donald Trump
BIG BREAKING: ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల్లో నిర్మించిన సినిమాలపై 100 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. వాణిజ్య శాఖ, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌లు తక్షణమే దీనిని ప్రారంభించాలని ఆదేశించారు. హాలీవుడ్‌ను గట్టెక్కించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : వీడు భర్త కాదు బండరాయి.. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తినేశాడు వెధవ!
ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు
ఈ మేరకు అమెరికా ఇండస్ట్రీలు తమ దేశం వెలుపల నిర్మించిన సినిమాలపై 100% పన్ను విధించబడుతుందని తెలిపారు. ఇతర దేశాలు అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను విదేశాలకు ఆకర్షించి, లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని విమర్శించారు. ఈ పరిస్థితి తమ ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికన్ చిత్ర పరిశ్రమను పునరుద్ధరించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. వాణిజ్య శాఖ, యుఎస్ వాణిజ్య ప్రతినిధి (యుఎస్టిఆర్) అమెరికా వెలుపల నిర్మించిన అన్ని చిత్రాలపై 100 శాతం సుంకాలు విధించే ప్రక్రియను ప్రారంభించాలని కోరారు.
Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!
'అమెరికన్ చిత్ర పరిశ్రమ వేగంగా నాశనం అవుతోంది. ఇతర దేశాల సమిష్టి ప్లాన్ వల్ల మా జాతీయ భద్రతకు ముప్పు ఉందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దేశీయ చిత్ర నిర్మాణంలోకి తిరిగి రావాల్సిన అవసరాన్ని ట్రంప్ నొక్కి చెప్పారు. అమెరికాలో మళ్ళీ సినిమాలు తీయబడాలని మేము కోరుకుంటున్నాం అన్నారు. కొత్త సుంకాలు అమెరికన్ గడ్డపై స్టూడియోలు తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రోత్సహిం అందిస్తాయన్నారు.
Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం
Also Read : కీలక అప్‌డేట్.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మరో టెర్రరిస్ట్ అరెస్టు
Donald Trump | hollywood | telugu-news | today telugu news