/rtv/media/media_files/2025/05/05/lHcjhAhnk4CKJYxEiOQa.jpg)
Another terrorist arrested in kulgam district, Jammu and Kashmir
కశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. కుల్గాం జిల్లాలో మరో ఉగ్రవాది ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే అరెస్టు చేశారు. వేషా నది సమీపంలో అతడిని పోలీసులు గుర్తించారు. అతడు నదిలోకి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించారు. ఈ విచారణలో ఆ ఉగ్రవాది పోలీసులకు కీలక విషయాలు వెల్లడించారు. టెర్రరిస్టులకు ఆహారం, ఆశ్రయం కల్పించానని ఇంతియాజ్ అహ్మద్ ఒప్పుకున్నాడు.
Also Read: కర్రెగుట్ట ఆపరేషన్ ఫెయిల్.. తప్పించుకున్న 3వేల మంది మావోయిస్టులు!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్ సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇప్పుడు మళ్లీ పాకస్థాన్ గొంతు ఎండేలా మరో నిర్ణయం తీసుకుంది. బగలిహార్ జలాశయం నుంచి నీటి సరఫరాను నిలిపివేసింది. అయితే ఇది జమ్మూలోని రాంబన్‌లో చినాబ్ నదిపై ఉంది. విద్యుదుత్పత్తికి ఉద్దేశించిన ప్రాజెక్టు నుంచి నీటిని వదలకపోవడం వల్ల పాకిస్థాన్‌లో పంజాబ్ ప్రావిన్సుకు సాగునీరు అందడం లేదు.
Also Read: 'రామ్ ద్రోహి'.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత సంచలన కామెంట్స్!
అలాగే ఝీలం నదిపై ఉన్న కిషన్ గంగ జలాశయం నుంచి నీటిని పాకిస్థాన్‌కు వెళ్లనియకుండా అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతను పెంచేలా మరిన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ఇక పాకిస్థాన్‌కు మరో బిగ్‌షాక్ తగిలింది. ముస్లిం దేశాలు పాక్‌ను ఏకాకి చేశాయి. ఆ దేశానికి మద్దతు ఇచ్చేందుకు ముస్లిం దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ ఇండియా వైపే ఉన్నాయి. భారత్‌తో ఆ దేశాలకు బలమైన వ్యాపార సంబంధాలు ఉండటమే దీనికి కారణం. అయితే ఏకపక్షంగా పాకిస్థాన్‌కు సపోర్ట్ ఇచ్చేందుకు సౌదీ నిరాకరించింది.
Also Read: భారత్‌కు కోహినూర్ వజ్రం.. బ్రిటన్ మంత్రి కీలక ప్రకటన
rtv-news | kashmir | terrorist