Fire Accident: రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం?

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కన్నాట్ ప్లేస్‌లోని బిక్‌గానే బిర్యానీ రెస్టారెంట్‌లో సిలిండర్ లీకేజీ కారణంగా ఎగిసిపడిన మంటల్లో ఆరుగురు తీవ్రంగా కాలిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. 6 అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేశారు.

New Update
hyd fire accident

Delhi Bikgane Biryani restaurant Fire accident

ఢిల్లీ (Delhi) లో ఘోర అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. కన్నాట్ ప్లేస్‌లోని బిక్‌గానే బిర్యానీ రెస్టారెంట్‌లో సిలిండర్ లీకేజీ కారణంగా ఎగిసిపడిన మంటల్లో ఆరుగురు తీవ్రంగా కాలిపోయారు. వారి పరిస్థితి విషమంగా ఉండగా ఆస్పత్రికి తరలించారు. 6 అగ్నిమాపక వాహనాలో మంటలను ఆర్పేశారు. 

Also Read :  బెస్ట్ హోలీ సాంగ్స్.. ఇవి వింటే హోలీ ఆడకుండా ఉండలేరు

ఆరుగురు తీవ్రంగా కాలిపోయారు..

ఈ మేరకు పోలీసులు, కస్టమర్లు తెలిపిన వివరాల ప్రకారం.. బిక్‌గానే బిర్యానీ రెస్టారెంట్‌లో గురువారం ఉదయం 11.55 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో జనమంతా ఉక్కిరిబిక్కిరయ్యారు.  ఈ మంటల్లో ఆరుగురు తీవ్రంగా కాలిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా 6 అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి వచ్చి మంటలను ఆర్పేశాయి. రెస్టారెంట్ వంటగదిలోని ఎల్‌పిజి సిలిండర్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చూడండి: గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్

ఇదిలా ఉంటే.. హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌రం ప‌రిధిలోని ముషీరాబాద్‌లో బుధ‌వారం రాత్రి భారీ పేలుడు జరిగింది. స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాంలో భారీ పేలుడు సంభ‌వించ‌డంతో ఓ కార్మికునికి తీవ్ర గాయాల‌య్యాయి.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భోల‌క్‌పూర్ గుల్షన్ నగర్ కట్ని కాంట సమీపంలో ప్లాస్టిక్ గోదాం ని రన్‌ చేస్తున్నారు. అందులో బీహార్‌కు చెందిన ఇసాక్ అహ్మద్(28) అనే వ్యక్తి ప్లాస్టిక్ వస్తువులను  పగుల‌గొట్టి శుభ్రపరిచే పని లో ఉన్నాడు. ఈ క్రమంలో ఓ కెమికల్ డబ్బా పగులగొడుతుండగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో ఏం జరిగిందో చుట్టుపక్కల వారికి అర్థం కాలేదు. దీంతో అందులో పని చేస్తున్న వ్యక్తి గురించి పెద్దగా పట్టించుకోలేదు.దీంతో అందులో పని చేస్తున్న ఇసాక్ అహ్మద్ తీవ్రం గాయాలపాలయ్యారు.

ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారు కష్టపడి పని చేస్తే విజయం మీదే!

Also Read :  ‘మా పెళ్లాలు తాగుడుకు బానిసలయ్యారు సారూ.. చర్యలు తీసుకోండి’.. పోలీస్ స్టేషన్‌కు భర్తలు!

Advertisment
తాజా కథనాలు