Horoscope Today:నేడు ఈ రాశివారు కష్టపడి పని చేస్తే విజయం మీదే!

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయాలు అందుకుంటారు. అంతేకాకుండా ఆదాయంలోనూ మంచి పెరుగుదల ఉంటుంది.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే.

New Update
horoscopee

horoscopee

 

మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు ఉంటాయి. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి ఉంది. సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. 

Also Read:  Ranya Rao Case: రన్యారావు పెళ్లికి ముఖ్యమంత్రి సిద్ధు!

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తులను కలుసుకుంటారు. నూతన అవకాశాలు అందుకుంటారు. కీలక వ్యవహారంలో నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది.

Also Read: Train Hijack: రైలు హైజాక్‌ ..ఆపరేషన్‌ సక్సెస్‌ అంటున్న పాక్‌ ఆర్మీ!


మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవ్వాలంటే చిత్తశుద్ధి అవసరం. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి.

కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఈ రోజు క్లిష్టమైన రోజు. ఆర్థిక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి.

సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో వ్యవహరిస్తే చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీ స్వశక్తిని నమ్మి పనిచేస్తే విజయం సిద్ధిస్తుంది. దృఢసంకల్పం, పట్టుదలతో క్లిష్టమైన పనులను కూడా సునాయాసంగా పూర్తిచేస్తారు.

కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మొండి పట్టుదల వీడితే మంచిది. సర్డుబాటు ధోరణితో అందరినీ కలుపుకొని పోవడం అవసరం. కీలక వ్యవహారాల్లో దూకుడు తగ్గించుకోవాలి. 

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయాలు అందుకుంటారు. అంతేకాకుండా ఆదాయంలోనూ మంచి పెరుగుదల ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తుంది. స్నేహితుల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు

వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. చక్కని అదృష్టం, లక్ష్మీకటాక్షం సంపూర్ణంగా ఉంటాయి. మనోధైర్యంతో చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి. మీ పనితీరు ఉన్నతాధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తొలగిపోతాయి.


ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే అవాంతరాలు ఆందోళన కలిగిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడండి.


మకరరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఊహించని ఖర్చులు చుట్టుముడతాయి. ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే పనులకు దూరంగా ఉండాలి.

కుంభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన పనిలో తోటివారి సహకారం ఉంటుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. ఈ రోజంతా ఆనందం, ఉత్సాహంతో నిండి ఉంటుంది. పట్టుదల, ఆత్మవిశ్వాసం కలిసికట్టుగా అద్భుతాలు సృష్టిస్తాయి.

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు చికాకు పెడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. దూకుడు తగ్గించుకుంటే పనులు సాఫీగా పూర్తవుతాయి.

Also Read: Haryana Municipal elections: హర్యానాలో వికసించిన కమలం.. 9 కార్పొరేషన్లు కైవసం!

Also Read: Business: స్టాక్ మార్కెట్ క్రాష్..ఇన్ఫోసిన్ నారాయణ మూర్తి ఫ్యామిలీ రూ. 6, 800 కోట్లు లాస్

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు