/rtv/media/media_files/2025/03/13/3jcWlQZRYDWFI2yWrcJs.jpg)
Husbands complaint wives addicted to alcohol in Koraput district of Odisha
ఇదిగిదిగో ఇక్కడ కనిపిస్తున్నవారందరూ ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. దాదాపు 10 మందికి పైగానే ఉన్నారు. వారంతా తప్పు చేసినందుకు అక్కడికి వెళ్లలేదు. దానికి ఓ బలమైన కారణం ఉంది. అది తెలిస్తే.. మీరంతా ముక్కున వేలేసుకుంటారు.
Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
తమ భార్యలు (Wifes) తాగుడుకు బానిసలయ్యారంటూ 10 మందికి పైగా పురుషులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పని చేసి కష్టపడి డబ్బులు తెస్తుంటే.. తమ భార్యలు మాత్రం ఆ డబ్బుతో మద్యం (Liquor) తాగుతున్నారంటూ వారు పోలీసుల ముందు వాపోయారు. మీరే దీనికి పరిష్కారం చేయాలంటూ ఆవేదన చెందారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
/rtv/media/media_files/2025/03/13/AWQ8OsTiN0VgQqS3S5sr.jpeg)
Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..
ఎక్కడ జరిగిందంటే?
సాధారణంగా భర్తలు మద్యానికి బానిసైతే భార్యలు పోలీస్ మెట్లు ఎక్కుతారు. కానీ ఒడిశా (Odisha) రాష్ట్రం కొరాపుట్ జిల్లాలో రివర్స్ అయింది. పూజారిపుట్ పంచాయతీలోని కొండగూడ గ్రామంలో భార్యలు మద్యానికి బానిసయ్యారు. అదే విషయాన్ని స్వయంగా తమ భర్తలు తెలిపారు. తమ భార్యలు మద్యానికి బానిసలు అయ్యారని పోలీసులకు, ఆబ్కారీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
Also Read : పెరుగన్నంతో పేగుల్లో పేరుకున్న బ్యాక్టీరియా పరార్
తాము కష్టపడి కూలి చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే.. తమ భార్యలు ఆ డబ్బులతో మందు తాగుతున్నారని పోలీసుల ముందు వాపోయారు. తమ గ్రామంలో కొందరు నాటు సారా విపరీతంగా తయారు చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.