/rtv/media/media_files/2025/03/13/4Z9sBD7IzirvgWZFaQv5.jpg)
టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ గుడ్ న్యూస్ చెప్పాడు. అతి త్వరలో రాహుల్ తండ్రి కాబోతున్నారు. అవును.. అతని భార్య అతియా శెట్టి వచ్చే నెలలో తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నారు. తన భార్య ఒడిలో సేదతీరుతూ రాహుల్ ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడవి వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలుచూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read : రైలు హైజాక్ ..ఆపరేషన్ సక్సెస్ అంటున్న పాక్ ఆర్మీ!
KL Rahul and Athiya Shetty are to be blessed with a baby. 👼❤️
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 12, 2025
- Many congratulations to them! pic.twitter.com/F0JDFmIe8f
కాగా రాహుల్, అతియా శెట్టి. 2023 జనవరిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురే ఈ అతియా శెట్టి. 2015లో హీరో సినిమాతో నటనా రంగ ప్రవేశం చేసిన అతియా, ముబారకన్, మోతీచూర్ చక్నాచూర్ వంటి చిత్రాల్లో కూడా నటించింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో
ఇక ఇటీవల ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. జట్టుకు అవసరమైనప్పుడు చివరి వరకూ క్రీజులో ఉండి జట్టును విజయతీరాలకు నడిపించాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రాహుల్ అజేయంగా 34 పరుగులు చేసి చివరివరకూ ఉండి మ్యాచ్ ను గెలిపించాడు. ఇక మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 లో ఢిల్లీ ఫ్రాంచైజీ తరపున ఆడుతున్నాడు.
Also read : స్టాక్ మార్కెట్ క్రాష్..ఇన్ఫోసిన్ నారాయణ మూర్తి ఫ్యామిలీ రూ. 6, 800 కోట్లు లాస్
Also Read: రోహిత్ కెప్టెన్సీని తక్కువగా అంచనా వేశారు: సెహ్వాగ్