Indigo Flight: షాకింగ్ ఘటన.. విమానాన్ని ఢీకొట్టి ఇంజిన్‌ లో పడిన పక్షి.. చివరికి ఏమైందంటే..!?

కేరళ నుంచి బెంగళూరు వెళ్లే విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టడం వల్ల ఫ్లైట్‌ క్యాన్సిల్‌ అయ్యింది. పక్షి విమానాన్ని ఢీకొని నేరుగా ఇంజిన్‌ లో పడింది. దీంతో విమానాన్ని వెంటనే రద్దు చేయాల్సి వచ్చింది. పక్షి ఢీకొన్న సమయంలో విమానంలో 179 మంది ప్రయాణికులు ఉన్నారు.

New Update
Indigo

Indigo Photograph: (Indigo)

ఓ పక్షి చేసిన పని వల్ల సుమారు  180 మంది తీవ్ర అవస్థలు పాలయ్యారు. ముఖ్యంగా గంటల తరబడి విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది. అందుకు ప్రధాన కారణం.. ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టడమే. రన్‌వేపై వేగంగా వెళ్తున్న విమానాన్ని పక్షి ఢీకొట్టింది. అంతేకాకుండా నేరుగా వెళ్లి ఇంజిన్‌లో పడింది. దీంతో సిబ్బంది వెంటనే విమానాన్ని రద్దు చేశారు. ముఖ్యంగా అందులో ఉన్న 179 మంది ప్రయాణికులకు ఏమీ జరగకుండా సురక్షితంగా బయటకు దింపారు. ఆపై విమానాన్ని అక్కడే నిలిపివేశారు. 

Also Read: Hyderabad: పాపం.. దొంగతనానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు.. ఏం జరిగిందంటే?

కేరళ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానం  తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో వ 179 మంది ప్రయాణికులతో బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. పైలెట్లు కూడా విమానాన్ని టేకాఫ్ చేసేందుకు రెడీ అయ్యారు.  రన్‌వేపై విమానాన్ని వేగంగా తీసుకుని వెళ్తున్న క్రమంలో ఓ గద్ద వచ్చి వారి విమానాన్ని వేగంగా ఢీకొట్టింది.

Also Read: EX Sarpanch: సూర్యాపేట మాజీ సర్పంచ్ ను చంపింది అల్లుళ్లే.. కూతుళ్లు కూడా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

దీంతో పక్షి నేరుగా వెళ్లి విమానం ఎడమ వైపు ఉన్న ఇంజిన్‌లో చిక్కుకుంది. విషయం గుర్తించి అధికారులు వెంటనే విమానాన్ని రద్దు చేశారు. ముఖ్యంగా క్షణాల్లోనే విమానాన్ని ఆపి అందులో ఉన్న 179 మంది ప్రయాణికులను  బయటకు తీసుకు వచ్చారు. ఆపై ఇంజిన్‌ను పరీక్షించి దాన్ని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రయాణికులు.. తాము వెళ్లాల్సిన విమానం రద్దు కావడంతో.. విమానాశ్రయంలోనే గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది.

వారు వెళ్లే విమానం ఉదయమే వెళ్లాల్సి ఉండగా.. సాయంత్రం 6.30 గంటలకు ఇండిగో సంస్థ మరో విమానాన్ని ఏర్పాటు చేసింది. మొత్తంగా 179 మంది ప్రయాణికులను మరో విమానం ద్వారా వారి గమ్య స్థానానికి చేర్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఓ పక్షి చేసిన పని వల్ల అంత మంది ఆగిపోవాల్సి వచ్చిందంటూనే.. ఆ పక్షి ఎంత పని చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: TG Cabinet Expansion: ఢిల్లీ నుంచి ఫోన్.. నాకు హోంశాఖ.. మంత్రి పదవిపై కోమటిరెడ్డి సంచలనం!

Also Read: Pooja Hegde: లక్షలు పెట్టి నన్ను ట్రోల్ చేయిస్తున్నారు.. నెగటివ్ పీఆర్ గుట్టువిప్పిన పూజ

kerala | indigo | flight | cancel | bird | latest-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
తాజా కథనాలు