EX Sarpanch: సూర్యాపేట మాజీ సర్పంచ్ ను చంపింది అల్లుళ్లే.. కూతుళ్లు కూడా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

సూర్యాపేట జిల్లా మిర్యాల మాజీ సర్పంచ్ మర్డర్ కేసులో భయంకర నిజాలు బయటపడ్డాయి. రాజకీయ ఆధిపత్యం కోసమే ముగ్గురు కూతుళ్లు, అల్లుళ్లు, వారి పిల్లలు కలిసి చక్రయ్యను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు.  

New Update

Nalgonda: సూర్యాపేట జిల్లాలో మాజీ సర్పంచ్ మర్డర్ కేసులో భయంకర నిజాలు బయటపడ్డాయి. నూతనకల్‌ మిర్యాల గ్రామానికి చెందిన మెంచు చక్రయ్య ఇటీవల దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో ప్రధాన సూత్రధారులు తన ముగ్గురు బిడ్డలు,  అల్లు్ల్లేనని పోలీసులు నిర్ధారించారు. రాజకీయ ఆధిపత్యం కోసమే వారంతా ఈ ఘోరానికి పాల్పడ్డారని, మొత్తం 13మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. 

2018లో గ్రామ సర్పంచ్‌గా..

ఈ మేరకు జిల్లా ఎస్పీ కొత్తపల్లి నర్సింహ ఈ కేసు వివరాలను వెల్లడించారు. మెంచు చక్రయ్య గతంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున సర్పంచ్ గా గెలిచారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే తన 3వ కూతురు కనకటి సునీతకు మద్దతుగా నిలిచి 2018లో గ్రామ సర్పంచ్ గా గెలిపించారు. తర్వాత 2020లో అల్లుడు కనకటి వెంకన్నను నూతనకల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌గా గెలిపించారు. దీంతో వెంకన్న బీఆర్‌ఎస్ మండల నాయకుడిగా ఎదిగాడు. అయితే కొంతకాలానికి చక్రయ్య, అల్లుడు వెంకన్న మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే చక్రయ్య తిరిగి కాంగ్రెస్ లో చేరాడు. 

రాజకీయాల్లో ఆధిపత్యం కోసం సొంత తండ్రినే హత్య చేయించిన కూతురు కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్యలో 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరులో చక్రయ్య గౌడ్‌ను అంతమొందించిన సొంత కూతురు, అల్లుడు సహా 11 మంది అరెస్ట్ సూర్యాపేట జిల్లా నూతన్‌కల్ మండలం మిరియాల గ్రామంలో ఈ 17న మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నేత చక్రయ్య గౌడ్ హత్య సొంత కూతురు, అల్లుడు సహా 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు గ్రామంలో రాజకీయ ఆధిపత్యం, వర్గ విభేదాలే చక్రయ్య గౌడ్ హత్యకు కారణమని తెలిపిన పోలీసులు గ్రామంలో 30 సంవత్సరాలు సర్పంచ్, సహకార సంఘం చైర్మన్ పదవులు చేసిన చక్రయ్య గౌడ్ తనకు వైరి వర్గంగా మారిన మామ చక్రయ్య గౌడ్‌ను అల్లుడు అంతమొందించాడని తెలిపిన పోలీసులు

Posted by నల్లగొండ జిల్లా వార్తలు on Monday, March 24, 2025

2025 బొడ్రాయి ఉత్సవాల్లో గొడవ..

వెంకన్న బీఆర్‌ఎస్ లోనే కొనసాగుతుండగా ఇద్దరి మధ్య గ్రామంలో 2023 బొడ్రాయి ప్రతిష్ఠి విషయంలో గొడవ మొదలైంది.  ఆ తర్వాత గ్రామంలో చక్రయ్య ఆధిపత్యమే నడుస్తుండగా ..2024 మార్చి 13న మాత్రం బొడ్రాయి వార్షికోత్సవం వెంకన్న ఆధ్వర్యంలో జరిగింది. అయితే 2025 బొడ్రాయి మూడో వార్షికోత్సవం వెంకన్నకు సమాచారం ఇవ్వకుండా చక్రయ్య నిర్వహించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే చక్రయ్యను చంపాలని కుటుంబసభ్యులు, అనుచ రులతో కలిసి మార్చి 13న ప్లాన్ చేశారు. 

పొలంకు వెళ్లి వస్తుండగా అటాక్..

ఇందులో  భాగంగానే మార్చి 17న చక్రయ్య తన పొలంకు వెళ్లి వస్తుండగా వెంకన్న అనుచరులు కర్రలు, మారణాయుధాలతో దాడి చేసి చక్రయ్యను హతమార్చారు. కనకటి శ్రవణ్‌, కనకటి లింగయ్య, కనకటి శ్రీకాంత, గంధసిరి వెంకటేష్‌, కనకటి ఉప్పలయ్య, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్‌ ను నిందితులుగా గుర్తించామని ఎస్పీ కొత్తపల్లి నర్సింహ తెలిపారు. చక్రయ్య కుమార్తె గునగంటి అనిత ఫిర్యాదు మేరకు వీరందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. 

Also Read: SIKANDAR Trailer: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!

సెల్‌ఫోన్లు పారేసి కొత్త సిమ్‌కార్డులు..
అయితే పరారీలో ఉన్న నిందితులు వెలుగుపల్లి వద్ద పట్టుబడ్డట్లు చెప్పారు. సెల్‌ఫోన్లు పారేసి కొత్త సిమ్‌కార్డులు, ఫోన్లు కొని వాడుతున్నారు. కావాల్సిన నెంబర్లు ఓ కాగితంపై రాసి పెట్టుకుని తిరుగుతున్నారు. ఇక విచారణలో హత్య చేయించింది తామేనని అంగీకరించారు. 13 మందిని అరెస్టుచేసి, నిందితుల నుంచి రెండు కార్లు, 10సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టుకు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. 

తుంగతుర్తి కోర్టులో లొంగిపోయి..
చక్రయ్య హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న కనకటి శ్రవణ్‌, కనకటి లింగయ్య, కనకటి శ్రీకాంత, గంధసిరి వెంకటేష్‌, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్ లు తుంగతుర్తి కోర్టులో లొంగిపోయారు. మిర్యాల గ్రామానికి చెందిన పీఏసీఎస్‌ మాజీ చైర్మన్ కనకటి వెంకన్నపై రౌడీషీట్‌ ఉందన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ గొల్లూరి రవి, తుంగతుర్తి సీఐ శ్రీనునాయక్‌, నూతనకల్‌ ఎస్‌ఐ మహేంద్రనాథ్‌, సిబ్బంది గోదేశి కర్ణాకర్‌, జోగు సైదులు, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

చక్రయ్య కుటుంబ సభ్యులు..
నిందితుల్లో మృతుడి కుటుంబసభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద కుమార్తె కనకటి స్వరూప, ఆమె భర్త ఉప్పలయ్య. వీరి కొడుకు శ్రవణ్‌, అనూష. చక్రయ్య 3వ కుమార్తె కనకటి సునీత, భర్త కనకటి వెంకన్న. వీరి కూతురు శ్రావ్య. 5వ కూతురు కనకటి కల్యాణి, భర్త లింగయ్య.

 

 sarpanch | murder | suryapet | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు