శబరిమల బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో కేరళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కీలక పురోగతి సాధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పీఠాధిపతిగా మారి వ్యాపారవేత్త అయిన ఉన్నికృష్ణన్ పొట్టిని శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు.