TG Cabinet Expansion: ఢిల్లీ నుంచి ఫోన్.. నాకు హోంశాఖ.. మంత్రి పదవిపై కోమటిరెడ్డి సంచలనం!

తనకు మంత్రి పదవి వస్తుందనే నమ్మకం ఉందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తనకు ఢిల్లీ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. హోంమంత్రి పదవి తనకు ఇష్టమన్నారు. సామర్థ్యాన్ని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని హైకమాండ్ ను కోరారు.

New Update

మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తనకు మంత్రి పదవి వస్తుందనే అనుకుంటున్నానన్నారు. నిన్న ఢిల్లీ లో సీరియస్ గానే కేబినెట్ విస్తరణపై చర్చ జరిగినట్లు ఉందన్నారు. అయితే తనకు ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి ఫోన్ రాలేదన్నారు. కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని హైకమాండ్ ను కోరారు. భువనగిరి ఎంపీ ఎన్నికల భాధ్యతలు ఇస్తే సమర్దవంతంగా నిర్వహించానని గుర్తు చేశారు. హోంమంత్రి పదవి తనకు ఇష్టమన్నారు. ఏ పదవి వచ్చినా సమర్దవంతంగా నిర్వహిస్తానని.. ప్రజల పక్షాన నిలబడతానని అన్నారు. 
ఇది కూడా చదవండి: EX Sarpanch: సూర్యాపేట మాజీ సర్పంచ్ ను చంపింది అల్లుళ్లే.. కూతుళ్లు కూడా.. వెలుగులోకి షాకింగ్ విషయాలు!

తెలంగాణలో కేబినెట్ విస్తరణపై హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో కీలక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు నిన్న ఢిల్లీకి వెళ్లడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మంత్రి వర్గ విస్తరణపై వీరు ప్రధానంగా హైకమాండ్ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం సాగుతోంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కూడా కేబినెట్లో తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Mallareddy: మల్లారెడ్డికి రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. భారీగా నిధులు మంజూరు!

ఆ ఇద్దరు ఔట్?

అయితే.. కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి తప్పించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూపల్లి కృష్ణారావు స్థానంలో.. అదే వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ రావును తీసుకుంటారని సమాచారం. విజయశాంతి పేరును కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు గాంధీభవన్ లో చర్చ సాగుతోంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు కూడా కేబినెట్ బెర్త్ ఖరారైనట్లు తెలుస్తోంది. మరో ఒకటి లేదా రెండ్రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు