/rtv/media/media_files/2025/02/17/haqRSrQD0Hb3EJxKFKSl.jpg)
TG Crime
దొంగతనానికి వెళ్లి ఏకంగా యముడి దగ్గరకే వెళ్ళాడు ఓ వ్యక్తి. సెక్యూరిటీ వారి నుంచి తప్పించుకోబోయి భవనంపై నుంచి కాలు జారి కిందపడ్డాడు. తలకు, ముఖానికి, కాళ్లకు, చేతులకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
దొంగతనానికి వెళ్లి..
ఆబిడ్స్ ఏసీపీ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అర్థరాత్రి సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమీపంలోని మనోరంజన్ కాంప్లెక్స్ లోకి వెళ్లారు. ఆ తర్వాత అక్కడ రెండో అంతస్థులో మూసి ఉన్న గదిలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో దొంగల అలికిడి విన్నసెక్యూరిటీ వారిని పట్టుకెందుకు వెళ్లగా.. భయంతో వేరే భవనంపైకి దూకేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి కాలు జారి కిందపడ్డాడు. దీంతో తలకు, ముఖానికి, కాళ్లకు, చేతులకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
అనంతరం స్థానికులు సమీపంలోని బేగంబజార్ పోలీసులకు సమాచారం అందించగా.. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే మరోవైపు ఇదొక హత్య అంటూ ప్రచారం జరుగుతుండగా.. ఆబిడ్స్ ఏసీసీ వెంకట్‌రెడ్డి, బేగంబజార్ సీఐ విజయ్‌కుమార్ క్లూస్ టీమ్ తో ఘటన స్థలానికి వెళ్లి వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. మరింత లోతుగా విచారించేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.
cinema-news | latest-news | nampalli
Also Read: GV Prakash: విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ట్విస్ట్ ఏంటంటే!