Central Government: అమెరికా నుంచి 2790 మంది భారతీయుల బహిష్కరణ..కేంద్రం వెల్లడి

అమెరికా నుంచి 2790 మంది భారతీయులను స్వదేశానికి పంపించేశారని భారత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అక్రమంగా నివసిస్తున్నవారిని, వీసా పత్రాలు సరిగ్గా లేని వారిని మాత్రమే బహిష్కరించారని తెలిపింది. 

New Update
ranadheer

భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్

ట్రంప్(Donald Trump) రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలపై కఠిన చర్యలను తీసుకున్నారు. చాలా మందిని అమెరికా(usa) నుంచి పంపించేశారు. మొదట్లో స్వతం విమానాలను ఏర్పాటు చేసి మరీ అమెరికా నుంచి అక్రమ వలదారులను తమ దేశాల్లో దింపేశారు. తరువాత కూడా ఎక్కడిక్కడ తనిఖీలను చేపడుతూ అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారందరినీ పంపేస్తూ వచ్చారు.  ఇప్పటికే వేలాది మందిని వారి స్వదేశాలకు పంపించిన ట్రంప్.. ఇప్పటికీ ఆ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు. 

Also Read :  ఆశపెట్టి.. తిరిగి లాగేసుకుంటున్నారు..జేడీ వాన్స్ పై తిరగబడ్డ భారత మహిళ

పత్రాలు సరిగ్గా లేని వారు..

ఈ క్రమంలో ఇప్పటి వరకు అమెరికాలో ఉంటున్న 2790 మంది భారతీయులను స్వదేశానికి పంపేశారు. ఈ లెక్కలను స్వయంగా భారత ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29 వరకు యూఎస్ లో అక్రమంగా నివసిస్తున్న 2,790 మందికి పైగా భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి వచ్చారని చెప్పారు. దీని గురించి మరింత వివరిస్తూ అమెరికాలో అక్రమంగా నివసిస్తూ, సరైన ధ్రువపత్రాలు లేని వారిని మాత్రమే..పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అది ధ్రువీకరించబడిన తర్వాతే వారిని తిరిగి దేశానికి తీసుకు వస్తున్నామని చెప్పారు. 

భారత్ కు వెనక్కి తిరిగి వచ్చిన వారి సంఖ్యను బట్టి అమెరికా ఎంత కఠినంగా రూల్స్ ను పాటిస్తుందో అర్థం అవుతోంది. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపేయడానికి అమెరికన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. హెచ్ 1బీ వీసా, విద్యార్థి వీసా, టూరిస్ట్ వీసా గడువు ముగిసినా లేదా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా.. అక్రమంగా సరిహద్దు దాటినా ఇలాంటి బహిష్కరణలు జరుగుతున్నాయి. ఇన్ని వేల మంది భారతీయులు ఇంత తక్కువ సమయంలో బహిష్కరణకు గురి కావడం ఇదే మొదటి సారని తెలుస్తోంది. 

Also Read: Jemimah Rodrigues: మ్యాచ్ తరువాత భావోద్వేగం జెమీమా..సంతోషాన్ని ఆపుకోలేక కన్నీళ్ళు

Advertisment
తాజా కథనాలు