/rtv/media/media_files/2025/10/31/jd-vans-2025-10-31-10-03-08.jpg)
అమెరికాలోని మిస్సిసిపీ విశ్వవిద్యాలయంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా...ఒక భారతీయ మహిళను ఆయనను ఎదుర్కొంది. కఠినమైన వలస వైఖరిపై ప్రశ్నలు అడుగుతూ ఆయనను సవాల్ చేసింది. ఇండియన్ డ్రెస్ వేసుకుని, బొట్టు పెట్టుకుని వచ్చిన మహిళ వాన్స్ పై నేరుగా ప్రశ్నలను సంధించింది. ట్రంప్ ప్రభుత్వం పాటిస్తున్న కఠినమైన వలస విధానం, వాన్స్ మతాంతర కుటుంబం గురించి ప్రశ్నలను అడిగింది.
మా కలలను నాశనం చేశారు..
ట్రంప్ పెట్టిన వలస విధానాన్ని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎప్పుడూ సమర్థిస్తారు. అంతేకాదు అమెరికాకు చట్టబద్ధమైన వలసలను పరిమితం చేయాలని కూడా ఆయన వాదిస్తారు. ఇప్పుడు ఉన్న దాని కంటే తక్కువగా విదేశీయులను రానివ్వాలని వాన్స్ చాలా రోజుల నుంచి చెబుతున్నారు. దీనిపైనే మిసిసిపి యూనివర్శిటీలోని భారత మహిళ ప్రశ్నలను గుప్పించింది. భారతీయుల అమెరికా కలలను తొక్కేశారని వాన్స్ ను ఆమె ఆరోపించింది. వలసల గురించి కఠిన నిర్ణయాలను ఎందుకు తీసుకున్నారని ఆమె నేరుగా ప్రశ్నించింది. అమెరికాలో ఉండడానికి మాకు సహాయం చేశారు. ఒక కలను ఇచ్చారు. కానీ దాని కోసం మేము అంత కంటే ఎక్కువ కష్టపడ్డాము అని ఆ మహిళ చెప్పుకుని వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మ కష్టమంతా వృధా అయిపోతుందని అనిపిస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు మార్గం కల్పించి..ఇప్పుడు బయటకు పొమ్మని ఎలా చెబుతారు అంటూ వాన్స్ ను మహిళ సూటిగా ప్రశ్నించారు. అంతే కాక జేడీ వాన్స్ భార్య ఉసా వాన్స్ క్రైస్తవురాలిగా మారడంపై కూడా ఆమె ప్రశ్నించారు.
భారతీయ మహిళ అడిగిన ప్రశ్నలకు ఉపాధ్యక్షుడు మొదట డంగై పోయారు. తర్వాత కాస్త సర్దుకుని సమాధానం చెప్పారు. చట్టబద్ధంగా వచ్చిన వారిని తాము ఇప్పటికీ ఆహ్వానిస్తున్నామని.. అమెరికాలో అలాంటి వారికి ఎప్పుడూ సమస్యలుండవని చెప్పారు. ఇప్పటికే అలా వచ్చి అమెరికా అభివృద్ధికి దోహదపడిన వారిని గౌరవిస్తున్నాని చెప్పుకొచ్చారు. అయితే అధిక వలసల జాతీయ ఐక్యతను దెబ్బ తీస్తాయని అందుకే అక్రమ వలస విధానాలపై కట్టుబడి ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇక తన భార్య మతం మారడంపై మాట్లాడుతూ..తన భార్య ఉష హిందూగా పెరిగిందని, కానీ అంతగా మతపరమైనది కాదని, వారు కలిసి తమ పిల్లలను క్రైస్తవులుగా పెంచాలని నిర్ణయించుకున్నారని వాన్స్ తెలిపారు. నా భార్య క్రిస్టియన్ గా మారాలని తాను అనుకుంటున్నానని..అయితే అది పూర్తిగా ఆమె ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. క్రైస్తవ విలువలు ఈ దేశానికి ముఖ్యమైన పునాది అని నేను ఎప్పటికీ భావిస్తానని..దానికి నేను ఎటువంటి క్షమాపణలు చెప్పను అని స్పష్టం చేశారు.
Also Read: Prince Andrew: కొంప ముంచిన ఎపిస్టీన్ ఫైల్స్.. రాజవంశీకుడినే గెంటేశారు..
 Follow Us
 Follow Us