Jemimah Rodrigues: మ్యాచ్ తరువాత భావోద్వేగం జెమీమా..సంతోషాన్ని ఆపుకోలేక కన్నీళ్ళు

ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా మ్యాచ్ గెలవడానికి కారణం జెమీమా రోడ్రిగ్స్. అద్భుతమైన ఇన్నింగ్స్ తో టీమ్ ఇండియాను ఫైనల్ కు చేర్చింది. మ్యాచ్ అనంతరం జెమీమా భావోద్వేగానికి గురైంది.  కలలా ఉంది నమ్మలేకపోతున్నా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. 

New Update
jemimah

వరల్డ్ కప్(ICC Women's World Cup) మొదలైన దగ్గర నుంచీ ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. దానికి తోడు ఏడు సార్లు ప్రపంచ కప్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్. అలాంటి జట్టును సెమీ ఫైనల్స్ లో హర్మన్ ప్రీత్ జట్టు మట్టి కరిపించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించి మరీ ఫైనల్స్ లోకి గర్వంగా అడుగు పెట్టింది. ఇందులో అందరి కంటే ముఖ్య పాత్ర వహించింది జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues).  అద్భుత ఇన్నింగ్స్‌తో జెమీమా  సంచలనం సృష్టించింది. అజేయ శతకంతో (127: 134 బంతుల్లో 14 ఫోర్లు) మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది.  కెప్టెన్ హర్మన్ ప్రీత్ తో కలిసి వికెట్‌కు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జెమీమా..టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చింది. 

Also Read :  ప్రాక్టీస్ లో బాల్ తగిలి టీనేజ్ క్రికెటర్ మృతి

అంతా ఒక కలలా ఉంది..

మ్యాచ్ అనంతరం జెమీమా భావోద్వేగానికి గురైంది. ఇదంతా ఒక కలలా ఉందని..నమ్మలేకపోతున్నా అంటూ సంతోషంతో కన్నీళ్ళు పెట్టుకుంది.  దేవుడి దయ వల్లనే ఇదంతా సాధ్యమైందని..అందుకు ఆయనకు ధన్యవాదాలు అని చెప్పింది. అమ్మ, నాన్న, కోచ్‌, నా ఆత్మీయులు నన్ను ఎంతో నమ్మారు. గత నెల చాలా కష్టంగా గడిచింది. ఇప్పటికి వాళ్ళ ఆశలు తీర్చగలిగాను. సెమీ ఫైనల్ మ్యాచ్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ కు వస్తానని ముందు నాకు తెలియదు. ఐదు నిమిషాల ముందే చెప్పారు. బ్యాటింగ్ కు వస్తున్నప్పుడు కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని అనుకోలేదు. హాఫ్ సెంచరీలు, సెంచరీల గురించి ఆలోచించలేదు. కానీ కచ్చితంగా పెద్ద స్కోరు మాత్రం చేసి టీమ్ ఇండియాను గెలిపించాలని మాత్రం అనుకున్నానని జెమీమా తెలిపింది. 

మంచి ఫామ్ లో ఉన్నా లాస్ట్ వరల్డ్ కప్ లో చోటు దక్కలేదు. ఈ సారి జట్టులో ఉన్నా ఎంతో ఒత్తిడికి గురౌతూనే ఉన్నా. రోజూ ఏడుస్తూనే ఉన్నా. మానసికంగా సరిగ్గా లేను. నేను మంచి ప్రదర్శన చేయాలని నాలోనే నేను అనుకునేదాన్ని. జట్టు కోసం నిలబడాలనుకున్నాను. అయితే మిగిలినదంతా దేవుడే చూసుకున్నాడు. బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ఎంతో ఒత్తిడి ఉన్నా.. చాలా ప్రశాంతంగా దాన్ని అధిగమించాలనుకున్నాను. అనుకున్నది సాధించాక, భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలవడంతో సంతోషాన్ని ఆపుకోలేకపోతున్నా అని చెప్పుకొచ్చింది జెమీమా. ఈ గెలుపు నాది ఒక్కదానిదే కాదు. నేను ఒక్కదాన్నే మ్యాచ్ ను గెలిపించలేదు..అందరూ సమిష్టిగా ఆడాము అని చెప్పింది. 

Also Read: Women's World Cup: అమ్మాయిలు అదరగొట్టేశారు..కప్పుకు అడుగు దూరంలో టీమ్ ఇండియా

Advertisment
తాజా కథనాలు