Dry Fruits: ఈ డ్రై ఫ్రూట్ ధర తక్కువే కానీ.. చలికాలంలో అది అందించే ప్రయోజనాలు మాత్రం ఎక్కువ

చలికాలంలో కీళ్ల నొప్పులు, దృఢత్వం, నిస్సత్తువతో బాధపడుతుంటారు. రెండు ఎండు ఖర్జూరాలు, టీస్పూన్ మెంతి గింజలను గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఆ నీటిని తాగి, నానబెట్టిన గింజలను, ఖర్జూర తింటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

New Update
Dry Fruits

Dry Fruits

చలికాలంలో శరీరానికి వేడిమిని, శక్తిని అందించడానికి ఎండు ఫలాలను (dry-fruits) తీసుకోవడం చాలా మంచిది. సాధారణంగా బాదం, వాల్‌నట్‌లను మాత్రమే దీనికి శక్తివంతమైనవిగా భావిస్తారు. అయితే ఒక చవకైన ఎండు పండు వాటి కంటే శక్తివంతమైందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ ఆయుర్వేద వైద్యుల అభిప్రాయం ప్రకారం.. చలికాలంలో ఖచ్చితంగా తినాల్సిన బాదం, వాల్‌నట్‌ల కంటే శక్తివంతమైన చవకైన ఎండు పండు ఉంది. ఆ అద్భుతమైన ఎండు ఖర్జూరం (Dry Dates) గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

చలికాలంలో ఎండు ఖర్జూరం ప్రయోజనాలు:

చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా.. అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఎండు ఖర్జూరం(dry-fruits-for-health) రక్షణ కల్పిస్తుంది. చలికాలంలో చాలా మంది కీళ్ల నొప్పులు, దృఢత్వం (Stiffness), నిస్సత్తువతో బాధపడుతుంటారు. దీనికి పరిష్కారం కోసం..  ప్రతి రాత్రి రెండు ఎండు ఖర్జూరాలు, ఒక టీస్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఉదయం పరగడుపున ఆ నీటిని తాగి, నానబెట్టిన గింజలను, ఖర్జూరాన్ని నమలడం ద్వారా దీర్ఘకాలిక కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. మెంతి గింజలు మంటను తగ్గిస్తాయి, ఖర్జూరాలు ఎముకలను బలోపేతం చేస్తాయి. చల్లని వాతావరణం కారణంగా చాలా మంది బలహీనత, అలసట, బరువుగా అనిపిస్తున్నట్లుగా ఉందని చెబుతూ ఉంటారు.

ఇది కూడా చదవండి: మూత్రంలో ఈ మార్పులు కనిపిస్తే.. మూత్రపిండాలు ఫసక్.. షాకింగ్ విషయాలు!

ప్రతి రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో 2-4 ఎండు ఖర్జూరాలు, 4-6 కిస్‌మిస్‌లు, 2 అత్తి పండ్లను (Figs) వేసి ఉడికించి తాగాలి. ఈ సాంప్రదాయ పద్ధతి 2-4 రోజుల్లోనే ఫలితాలను చూపిస్తుంది. ఎండు ఖర్జూరం వేడిమిని, పోషకాలను అందిస్తే, కిస్‌మిస్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అత్తి పండ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీనితో బలం కోసం ఖరీదైన సప్లిమెంట్స్ అవసరం ఉండదు. చలికాలంలో దగ్గు, గొంతు నొప్పి, ఛాతీ బిగుతు సాధారణం. 2-4 ఎండు ఖర్జూరాలను బాగా నమిలి గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఛాతీలో పేరుకుపోయిన కఫం కరిగి బయటకు వస్తుంది. ఇది శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేసి.. ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుంది. ఎండు ఖర్జూరం ధర తక్కువగా ఉన్నప్పటికీ.. చలికాలంలో శరీరానికి ఇది చాలా శక్తివంతమైన ఆహారం. కాబట్టి దీనిని తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: శీతాకాలంలో ఎన్ని నీళ్లు తాగాలో తెలుసా..? ఇలా చేయకపోతే మూత్రపిండాలు, మెదడుకు డేంజర్!

Advertisment
తాజా కథనాలు