/rtv/media/media_files/2025/11/18/drink-water-winter-2025-11-18-15-24-11.jpg)
Drink Water Winter
చలికాలం(winter-health-tips)లో చల్లటి వాతావరణం కారణంగా దాహం తగ్గడం, నీరు తాగాలనే కోరిక తగ్గడం సర్వసాధారణం. అయితే ఈ అలవాటు శరీరానికి, కిడ్నీలు, మెదడుకు దీర్ఘకాలికంగా హాని కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు 500 ml కంటే తక్కువ నీరు తాగితే దీర్ఘకాలిక కిడ్నీ, మెదడు సంబంధిత సమస్యలతోపాటు అనేక అనారోగ్యాలు తలెత్తుతాయని చెబుతున్నారు. చలి ఎక్కువగా ఉందని తక్కువ నీరు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో..? రోజుకు ఎంత నీరు తాగడం ముఖ్యమో..? వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. - best-health-tips
నీరు తక్కువ తాగితే వచ్చే సమస్యలు:
కిడ్నీల వడపోత నెమ్మదించడం (Slowing Kidney Filtration):కొందరూ వ్యక్తులు చాలా తక్కువ నీరు తాగినప్పుడు (500 ml కంటే తక్కువ), కిడ్నీలు నీటిని వడపోయడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల మూత్రం చిక్కబడుతుంది. శరీరంలోని అదనపు వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియ నెమ్మదించి, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది.
మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గడం:శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల రక్త పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా మెదడుకు చేరే ఆక్సిజన్ పరిమాణం తగ్గి.. ఏకాగ్రత లోపించడం, మూడ్ స్వింగ్స్, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి.
కండరాల నొప్పి- శక్తి లేమి: తగినంత నీరు లేకపోవడం వల్ల కండరాలకు శక్తి సరఫరా తగ్గుతుంది. దీని ఫలితంగా తరచుగా అలసటగా అనిపించడం లేదా శక్తి లేమి (Lack of Energy) ఏర్పడవచ్చు.
ఇది కూడా చదవండి: అంజీర్ పండ్లతో ప్రయోజనం పొందాలంటే ఎప్పుడు ఎలా తినాలో తప్పకుండా తెలుసుకోండి
జీర్ణక్రియ నెమ్మదించడం: జీర్ణక్రియలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. నీరు తక్కువగా తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల మలబద్ధకం, అజీర్తి సమస్యలు పెరుగుతాయి. ఇది ఆకలిపై కూడా ప్రభావం చూపుతుంది.
దీర్ఘకాలిక సమస్యల ప్రమాదం: చలికాలంలో నిరంతరం తక్కువ నీరు తాగడం వల్ల కాలక్రమేణా శరీరంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది చిక్కబడిన మూత్రం, కిడ్నీల వడపోత రేటు తగ్గడం, శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఇబ్బందులకు దారి తీస్తుంది. దీర్ఘకాలంలో ఇది తీవ్రమైన అనారోగ్యాలకు దారితీయవచ్చు. అందుకని చలికాలంలో దాహం తక్కువగా ఉన్నప్పటికీ.. శరీరం సరిగా పనిచేయడానికి, పైన పేర్కొన్న సమస్యలను నివారించడానికి 2-3 లీటర్ల నీరు, ఇతర ద్రవాలను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుందా..! వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి!!
Follow Us