Health Tips: ఉదయాన్నే ఒక స్పూన్ పసుపు, తేనె తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా?

ఆరోగ్యకరమైన అలవాట్లలో పసుపు, తేనె మిశ్రమం తీసుకోవడం ఒకటి. ఇది రుచితోపాటు శరీరాన్ని స్వచ్ఛం చేయడం, అనేక వ్యాధుల నుంచి రక్షణ కలిగించే శక్తిని కలిగి ఉంటుంది. తేనె, పసుపు కలిపిన మిశ్రమం గొంతును తేమగా ఉంచి చెడు బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది.

New Update
Turmeric and Honey

Turmeric and Honey

ప్రతి ఉదయం నిద్రలేచిన వెంటనే సహజ మార్గంలో ప్రారంభించడం వల్ల మానసికంగా, శారీరకంగా ఎంతో మంచిది. అలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లలో పసుపు, తేనె మిశ్రమం తీసుకోవడం ఒకటి. ఇది పూర్వీకులు ఎన్నో ఏళ్లుగా వాడుతున్న వంటకం. ఇది రుచితోపాటు శరీరాన్ని స్వచ్ఛం చేయడం, వ్యాధుల నుంచి రక్షణ కలిగించే శక్తిని కలిగి ఉంటుంది. పసుపులో ఉండే రసాయనం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో ఉంటుంది. తేనె సహజ యాంటీ బయోటిక్‌గా పని చేస్తుంది. ఈ రెండింటి ప్రభావం వల్ల శరీరంలో ఉన్న హానికరమైన టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి. 

Also Read :  తండ్రీకొడుకును బలితీసుకున్న ఆన్ లైన్ బెట్టింగ్.. ఒకరికోసం మరొకరు దారుణం!

చెడు బ్యాక్టీరియా నుంచి ఉపశమనం:

ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ స్వచ్ఛమైన తేనెలో అర టీస్పూన్ పసుపు పొడి కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తిని గణనీయంగా పెరుగుతుంది. ఇది శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియాల ప్రభావాల నుంచి కాపాడుతుంది. ఈ మిశ్రమం జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. జలుబు, దగ్గు, గొంతు నొప్పులకు ఇది సహజ నివారణగా పనిచేస్తుంది. తేనె, పసుపు కలిపిన మిశ్రమం గొంతును తేమగా ఉంచి చెడు బ్యాక్టీరియా నుండి రక్షిస్తుంది. శరీరంలో ఎక్కడైనా వాపు, కీళ్ల నొప్పులు ఉన్నా దీనిని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

ఇది కూడా చదవండి: బరువు త్వరగా తగ్గాలని ఉందా..? ఈ 7 రకాల పానీయాలు ట్రై చేయండి

ఈ మిశ్రమం చర్మాన్ని కూడా లోపల నుంచి శుభ్రపరిచి ప్రకాశవంతంగా చేస్తుంది. లోపల నుంచి జరిగే డీటాక్సిఫికేషన్‌ వల్ల ముడతలు, మొటిమలు లాంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈ కషాయంలో జీవక్రియ వేగాన్ని పెంచే గుణం ఉంది. ఆకలి నియంత్రణలో ఉంచి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పసుపు, తేనె వేర్వేరుగా ఒకదానికొకటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నా కలిపి తీసుకున్నప్పుడు అది శరీరానికి రెండు రెట్లు లాభం చేస్తుంది. ప్రతి రోజు ఉదయం దీన్ని తీసుకునే అలవాటు వేసుకుంటే..15 రోజుల్లోనే మీ శరీరంలో తేడా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read :  Google Logo Change: పదేళ్ల తర్వాత.. గూగుల్ లోగోలో ఆ మార్పులు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పాలన్నం తింటే ఆరోగ్యానికి తక్షణ శక్తి.. ఇలా ట్రై చేయండి

(health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | honey | turmeric)

Advertisment
Advertisment
తాజా కథనాలు