Milk Rice: పాలన్నం తింటే ఆరోగ్యానికి తక్షణ శక్తి.. ఇలా ట్రై చేయండి

పాలన్నం సులభంగా జీర్ణమయ్యే ఆహారం కావడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. పాలు, రైస్‌ కలిసిన ఆహారం తింటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, బి12 వంటి పోషకాలు ఎముకలు, దంతాలు, కండరాలు, నరాల బలోపేతం చేయటంలో సహాయపడతాయి.

New Update

Milk Rice: పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలు, నెయ్యి, పెరుగు, పాలతో చేసిన ఏ ఆహార పదార్ధాలైన రోజు తింటే ఆరోగ్యానికి మంచిదంటారు. వాటిల్లో పాల అన్నం ఒకటి. పాలల్లో అన్నం వేసుకుని తినడం అనేది  కొందరికి ఇష్టమైన ఆహారంగా చెబుతారు. దీనిని తయారు చేయడం ఎంత సులభమో.. జీర్ణం కావడంలోనూ అంతే సులభంగా ఉంది. పాలు, రైస్‌ కలిసిన ఈ ఆహారం తింటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. అయితే ఉదయం దీనిని తింటే రోజంతా శక్తివంతంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. పాలన్నంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12 వంటి ముఖ్యమైన పోషకాలు ఎముకలు, దంతాలు, కండరాలు, నరాల బలోపేతం చేయటంతోపాటు ఎర్రరక్త కణాల ఉత్పత్తిలోనూ సహాయపడతాయి. పాలన్నంలో ఉన్న కార్బోహైడ్రేట్లు శక్తి, శారీరక ఆరోగ్యాన్ని మెరుగు పరిచేలా చేస్తుంది.

Also Read :  బరువు తగ్గాలని అధికంగా పరిగెడుతున్నారా.. వామ్మో ఇక మీ సంగతి అంతే

సులభంగా జీర్ణమయ్యే ఆహారం..

పాలన్నం తినడం వలన జీర్ణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. ఇది సులభంగా జీర్ణమయ్యే ఆహారం కావడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది.  దీనివల్ల తరచూ తినాలన్న కోరిక తగ్గుతుంది. అతిగా తినే అలవాట్లను నియంత్రించడంలో పాలన్నం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే పాలు జీర్ణం చేసుకోలేని వారికి ఇబ్బంది ఉంటే ఈ సమస్య ఎక్కువగా మారవచ్చు. కొన్ని సందర్భాల్లో పాలన్నం వల్ల ఆమ్ల ఉత్పత్తి పెరగడం వల్ల అజీర్తి సమస్యలు కూడా వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  గ్యాస్ మంట మీద కాల్చిన రోటీ తింటే క్యాన్సర్ వస్తుందా..?

పాలన్నంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని తరచూ మితిమీరిన మోతాదులో తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. బరువు నియంత్రణలో ఉండాలకునేవారు ఈ ఆహారాన్ని అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవడం మంచిది. అంతేకాక పాలన్నం తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలగవచ్చు. అందుకే దీనిని తినే సమయం, తినిన తర్వాత చేయవలసిన పనులపై జాగ్రత్త వహించాలి. పాలన్నం పోషకాలతో నిండి, శక్తినిచ్చే ఆహారంగా కాబట్టి దీన్ని తినే ముందు వ్యక్తిగత శారీరక పరిస్థితిని, జీర్ణశక్తిని పరిగణనలోకి తీసుకోవాలి. అవసరమైతే వైద్యుని సలహాతో పాలన్నాన్ని ఆహారంగా తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

Also Read :  బరువు త్వరగా తగ్గాలని ఉందా..? ఈ 7 రకాల పానీయాలు ట్రై చేయండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:  ఈ గడ్డి అనేక వ్యాధులకు దివ్యౌషధం.. ప్రత్యేకత ఏమిటంటే..!!

( health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news )

Advertisment
Advertisment
తాజా కథనాలు