/rtv/media/media_files/2025/05/13/ubbIFl7T8dUcfnvK37yA.jpg)
Google logo Change
దాదాపు పదేళ్ల తర్వాత గూగుల్ సంస్థ లోగోలో మార్పులు చేసింది. గూగుల్ లోగో ‘జీ’ను సరికొత్తగా డిజైన్ చేసినట్లు వెల్లడించింది. గతంలో ఈ లోగో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల్లో బ్లాక్‌లుగా ఉండేది. ఇప్పుడు ఒకే బ్లాక్‌లో వేర్వేరు రంగుల్లో ఫ్లూయిడ్ గ్రేడియంట్ డిజైన్‌లోకి మార్చింది.
🚨 Google has updated its logo for the first time in 10 years. pic.twitter.com/HpkYdg3fCe
— Indian Tech & Infra (@IndianTechGuide) May 13, 2025
ఇది కూడా చూడండి: BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
కొత్త లుక్‌లో లోగో డిజైన్..
గూగుల్ సంస్థ 2015 నుంచి ఇప్పటి వరకు జీ లోగోలో మార్పులు చేయలేదు. గతంలో ఫ్లాట్‌గా బ్లాక్‌ల్లో రంగులు ఉండేవి. ఇప్పుడు దానికి నాలుగు రంగులను గ్రేడియంట్ చేయడంతో.. లుక్ కొత్తగా కనిపిస్తుంది. ఇకపై గూగుల్ అన్ని విభాగాల్లో ఈ జీ లోగోనే ఉపయోగించాలని భావిస్తోంది. అయితే ఏఐ జనరేటివ్ అసిస్టెంట్ గూగుల్ జెమిని బ్రాండింగ్‌కు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI
ఈ లోగో ముందుగా గూగుల్ సెర్చ్ యాప్ ద్వారా ఐఓఎస్, పిక్సెల్ యూజర్లకు రానుంది. ఆ తర్వాత గూగుల్ యాప్ బీటా వెర్షన్ 16.18 ద్వారా కొన్ని ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో రానుంది. అయితే ఈ లోగో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని గూగుల్ ఇంకా వెల్లడించలేదు. అయితే గూగుల్ క్రోమ్, మ్యాప్స్, జీమెయిల్, డ్రైవ్ వంటి వాటిలో కూడా లోగో మారుస్తారా? లేదా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
What if Google reimagined every Logo of its services in the same sleek style? That would be seriously satisfying! 😍#Google #GoogleLogo pic.twitter.com/C9TIdMNAoT
— Ujjwal Kumar (@imujjwaal) May 13, 2025
ఇది కూడా చూడండి: పాకిస్థాన్ కిరానా హిల్స్‌లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!
email | 10-years | changes