/rtv/media/media_files/2025/01/30/KMWBGs32Sy6zg44KO35E.jpg)
Toothache Photograph: (Toothache)
Toothache Relief Tips: పంటి లోపల చిగుళ్లు వాపుల, దంతాల ఇన్ఫెక్షన్(Tooth Infections) వల్ల నొప్పి రావడం వల్ల కొందరు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. భరించలేనంతగా పంటి నొప్పి ఉంటుంది. దీని వల్ల తినడానికి, తాగడానికి కూడా చాలా కష్టపడతారు. అయితే ఈ నొప్పి నుంచి విముక్తి చెందాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.
ఇది కూడా చూడండి: Papaya Side Effects: వీరు పొరపాటున బొప్పాయి తింటే.. సమస్య పెరగడం ఖాయం
నోటిలో వేసి పుక్కిలిస్తే..
ఉప్పును గోరువెచ్చని నీటిలో వేసి పుక్కిలించడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. ఉప్పులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపు, నొప్పిని తగ్గిస్తాయి. రోజుకి రెండు సార్లు ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది.
ఇది కూడా చూడండి: Health Tips: తల దురద కేవలం చుండ్రు వల్లే కాదు..ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు
లవంగం నూనెను నోటిలో వేసి పుక్కిలించినా మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని యూజినాల్ అనే మూలకం పంటి నొప్పిని తగ్గిస్తుంది. నోటిలో వేసి పుక్కిలించలేకపోతే.. కాటన్ క్లాత్‌ని నూనెలో తడిపి దాన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో మెల్లిగా రుద్దండి. దీంతో పంటి నొప్పి తగ్గుతుంది.
ఇది కూడా చూడండి: Dengue: బొప్పాయి ఆకులు నిజంగానే ప్లేట్లెట్స్ ను పెంచుతాయా? సైన్స్ ఏం చెబుతోంది?
బేకింగ్ సోడాతో దంతాలు ఈజీగా శుభ్రం అవుతాయి. పళ్లలో ఉన్న బ్యాక్టీరియా, వాపు తగ్గుతాయి. బేకింగ్ సోడాను నీళ్లలో కలిపి పేస్ట్‌లా చేసి దంతాలపై అప్లై చేస్తే పంటి నొప్పి తగ్గుతుంది.
అల్లం, తేనె కలిపిన పేస్ట్‌ను పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో అప్లై చేస్తే నొప్పి, వాపు అన్ని తగ్గుతాయి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.