/rtv/media/media_files/2025/09/16/claw-clip-in-eye-brow-2025-09-16-20-12-50.jpg)
Claw Clip in Eye Brow
సోషల్ మీడియా(Social Media) లో నిత్యం ఏదో ఒక కొత్త ట్రెండ్ వైరల్ అవుతుంది. ఇటీవల టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వింతైన ట్రెండ్ చర్చనీయాంశంగా మారింది. దీనిలో ప్రజలు తమ కనుబొమ్మల మధ్య క్లా క్లిప్ (Claw Clip) పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుందని పేర్కొంటున్నారు. అంతేకాదు..ఈ ట్రిక్‌ని ప్రయత్నిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఇది తలనొప్పికి సులభమైన పరిష్కారం అని చెబుతున్నారు. కానీ ఈ ట్రిక్ నిజంగా పనిచేస్తుందా లేక ఇది కేవలం ఒక వైరల్ జోకా? అనేది తేలియటంలేదు. వీడియోలలో తలనొప్పి ఉన్నప్పుడు కనుబొమ్మల మధ్య లేదా నుదుటిపై చిన్న క్లచర్ క్లిప్ పెట్టుకోవడం చూపిస్తారు. ఇది ప్రెషర్ పాయింట్స్‌పై ఒత్తిడి కలిగించడం వల్ల తలనొప్పి తగ్గుతుందని వారి వాదన. కొందరు దీనిని ఆక్యుప్రెషర్ థెరపీతో పోల్చి.. శరీరంలోని నిర్దిష్ట పాయింట్లపై ఒత్తిడి కలిగించడం ద్వారా నొప్పి, ఒత్తిడిని తగ్గించవచ్చని పేర్కొంటున్నారు.
టిక్‌టాక్ ట్రెండ్ వైరల్..
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ట్రెండ్‌కు శాస్త్రీయ ఆధారాలు లేవు. నుదుటిపై లేదా కనుబొమ్మల మధ్య స్వల్ప ఒత్తిడి ఇవ్వడం వల్ల తాత్కాలికంగా ట్రిగ్గర్ పాయింట్స్ రిలాక్స్ అయ్యి.. తలనొప్పి తగ్గినట్లు అనిపించవచ్చు. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదు. దీనిని ఒక చికిత్సగా భావించడం సరైంది కాదంటున్నారు. ఈ ట్రెండ్ సులభంగా ఉండటం.. త్వరగా ఫలితం ఇస్తుందని చెప్పడం, వినోదాత్మకంగా, విచిత్రంగా ఉండటం, సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మందిని ఆకర్షించడంతో ఇది త్వరగా వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: మల విసర్జన సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కాలేయం దెబ్బతిన్నట్లే
సాధారణంగా తలనొప్పి వస్తుంటే.. ఇలాంటి ట్రెండ్స్‌పై ఆధారపడటం కన్నా దాని అసలు కారణాన్ని తెలుసుకోవడం అవసరం. ఎక్కువగా నీళ్లు తాగడం, సరైన నిద్ర, స్క్రీన్ టైమ్ తగ్గించడం, కెఫీన్, ఒత్తిడిని నియంత్రించడం అవసరం. అవసరమైతే వైద్యుడిని సంప్రదించడం మంచిది. కనుబొమ్మల మధ్య క్లచర్ క్లిప్ పెట్టుకునే ఈ టిక్‌టాక్ ట్రెండ్(tiktok Trend) కేవలం వినోదం కోసం మాత్రమే. ఇది తలనొప్పికి శాశ్వత పరిష్కారం కాదు. ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ శాస్త్రీయంగా నిరూపితమైన, విశ్వసనీయమైన పద్ధతులనే అనుసరించాలని మరి కొందరు నిపుణులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: నడుము నుంచి పాదాల వరకు తీవ్రమైన నొప్పా..? విస్మరిస్తే జీవితాంతం సమస్యలు తప్పవు!!