Back Pain: నడుము నుంచి పాదాల వరకు తీవ్రమైన నొప్పా..? విస్మరిస్తే జీవితాంతం సమస్యలు తప్పవు!!

నడుము నొప్పి వెనుక సైటికా వంటి సమస్యలు ఉండవచ్చు. సైటికా నొప్పి ఉంటే ఎక్కువసేపు కాళ్ళు మడిచి కూర్చోలేరు. అలా కూర్చుంటే మోకాళ్ల పక్కన తీవ్రమైన నొప్పి వస్తుంది. తప్పుడు భంగిమలో కూర్చోవడం, నిలబడటం, వెన్నుపూసకు గాయం, స్లిప్ డిస్క్ వంటి సమస్యలకి దారితీస్తాయి.

New Update
Back Pain

Back Pain

నేటి ఆధునిక జీవనశైలి(Life Style) లో నడుము నొప్పి చాలా సాధారణ సమస్యగా మారింది. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం, మొబైల్ ఫోన్‌లను నిరంతరం వాడటం, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. చాలా మంది ఈ నొప్పిని సాధారణంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఈ నొప్పి నరాలకు సంబంధించినదైతే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. అలాంటి తీవ్రమైన నడుము నొప్పి వెనుక సైటికా వంటి సమస్యలు ఉండవచ్చు. ప్రాణాలను తోడే నడుము నొప్పి ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైటికా లక్షణాలు మరియు చికిత్స గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

సైటికా లక్షణాలు..

సైటికా(Sciatica) అనేది వెన్నుపూస నుంచి వచ్చే సైటిక్ నరాల మీద ఒత్తిడి లేదా వాపు కారణంగా వస్తుంది. ఈ నరం నడుము కింది భాగం నుంచి పిరుదులు, తొడలు, కాళ్ళ వరకు విస్తరించి ఉంటుంది. ఈ నరంపై ఒత్తిడి పడినప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి కేవలం నడుముకే పరిమితం కాకుండా మొత్తం కాలి వరకు వ్యాపిస్తుంది. కొందరికి విద్యుత్ షాక్‌లాంటి నొప్పి అనిపిస్తే, మరికొందరికి మంట, తిమ్మిరి, గుచ్చుకుంటున్నట్లు బాధ అనిపిస్తుంది. ప్రారంభంలో ఈ నొప్పి అడపాదడపా వచ్చిపోతుంటుంది. కానీ, సమయం గడిచే కొద్దీ ఈ నొప్పి నిరంతరంగా ఉంటుంది. ఇది రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంది. కొన్నిసార్లు నొప్పి తీవ్రత పెరిగి నడవడం, మెట్లు ఎక్కడం, కూర్చోవడం, పడుకోవడం వంటివి కూడా కష్టంగా మారుతాయి.

ఇది కూడా చదవండి: ఈ ఒక్క ఆకును మీ కిచెన్‌లో ఉంచితే చాలు.. బొద్దింకలు పరుగో పరుగు!

నొప్పి నడుము(Back Pain) కింది భాగం నుంచి ప్రారంభమై పిరుదులు, తొడల వెనుక నుంచి కాలి వరకు వస్తుంటే అది సైటికా లక్షణం కావచ్చు. ఎక్కువసేపు పడుకోవడం, కూర్చోవడం, నిలబడటం వల్ల నొప్పి పెరుగుతుంది. కొన్నిసార్లు కాళ్ళలో మంట లేదా తిమ్మిరి అనుభూతి కూడా కలుగుతుంది. సైటికా నొప్పి ఉన్నవారు ఎక్కువసేపు కాళ్ళు మడిచి కూర్చోలేరు. అలా కూర్చుంటే మోకాళ్ల పక్కన తీవ్రమైన నొప్పి వస్తుంది. అయితే సైటికా నొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో కొన్ని సాధారణంగా నిర్లక్ష్యం చేసేవి కూడా ఉన్నాయి. తప్పుడు భంగిమలో కూర్చోవడం, నిలబడటం, నిరంతరం బరువైన వస్తువులను ఎత్తడం, వెన్నుపూసకు గాయం, స్లిప్ డిస్క్ వంటి సమస్యలు. ఈ కారణాలు సైటిక్ నరంపై ఒత్తిడి కలిగించి నొప్పికి దారితీస్తాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: మల విసర్జన సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కాలేయం దెబ్బతిన్నట్లే

Advertisment
తాజా కథనాలు