Nails Scratches: గోళ్లపై గీతలు దేనిని సూచిస్తాయో తెలుసా..? కారణాలు తెలుసుకోండి

గోళ్లపై పొడవైన, తెల్లటి గీతలు కనిపించడం కూడా వృద్ధాప్యానికి సంకేతం. వయస్సు పెరిగే కొద్దీ.. శరీరంలో పోషకాహార లోపం మొదలవుతుంది. ఇది ఆరోగ్య పరిస్థితులకు, పోషకాహార లోపాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
nails Scratches

Nails Scratches

శుభ్రమైన, అందమైన గోర్లు చేతుల అందాన్ని పెంచుతాయి. కానీ గోళ్లు చెడిపోవడం, విరగడం, నల్లగా మారడం, పసుపు రంగులోకి మారడం, గోళ్లపై గీతలు కనిపించడం వంటి ఉంటే ఇది సాధారణ విషయం కాదు. అలాంటి గోళ్లు చెడుగా కనిపించడమే కాకుండా శరీరంలో పోషకాల కొరతను కూడా సూచిస్తాయి. గోళ్లపై గీతలు కనిపించడం అనేక కారణాల వల్ల కావచ్చు. ఇందులో వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యలు, శరీరంలో ఏదైనా ప్రత్యేకమైన పోషకం లేకపోవడం వంటివి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎందుకు జరుగుతుందో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Also Read :  చార్‌ధామ్ భక్తులకు బిగ్ అలర్ట్.. మరోసారి యాత్ర వాయిదా!

ఆనారోగ్య లోపాలాన్ని గోళ్లపై..

గోళ్లపై పొడవైన, తెల్లటి గీతలు కనిపించడం కూడా వృద్ధాప్యానికి సంకేతం. వయస్సు పెరిగే కొద్దీ.. శరీరంలో పోషకాహార లోపం మొదలవుతుంది. ఇది ఆరోగ్య పరిస్థితులకు, పోషకాహార లోపాలకు దారితీస్తుంది. కానీ రేఖలు చాలా లోతుగా ఉండి.. గోళ్లు విరిగి నల్లగా మారుతుంటే ఇవి ఆనారోగ్య సంబంధిత సంకేతాలు కావచ్చు. గోళ్లపై సరళ రేఖలు వృద్ధాప్యం కారణంగా వస్తాయి.  కానీ రేఖలు చాలా లోతుగా ఉండి.. దానితో పాటు గోళ్లు విరిగిపోతున్నా, రంగు మారుతున్నా శరీరంలో ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.

ఇది కూడా చదవండి: క్యాన్సర్ నివారణకు ఐదు ఆహారాలు.. డైట్‌లో చేర్చుకుంటే దెబ్బకు పరార్

కొన్నిసార్లు తామర, చాలా పొడి చర్మం, హైపోథైరాయిడిజం వంటి సమస్యల కారణంగా.. గోళ్లు మందంగా, సన్నగా మారి విరిగిపోతాయి. దీని కారణంగా.. గోళ్లు సులభంగా విరిగిపోతాయి. లైకెన్ ప్లానస్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీనిలో గోళ్లపై గీతలు కనిపిస్తాయి.  వీటిని బ్యూ లైన్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ఒత్తిడి,ఏదైనా వ్యాధి కారణంగా పెరుగుతాయి. దీనిని ల్యూకోనిచియా స్ట్రియాటా అంటారు. ఈ గీతలు మైక్రోట్రామా, ఒనికోమైకోసిస్, వంశపారంపర్య వ్యాధుల వల్ల కనిపించవచ్చు. కొంతమందికి గోళ్లపై నలుపు, గోధుమ రంగు గీతలు ఏర్పడతాయి. వీటిని మెలనోనిచియా అంటారు. 

Also Read :  రాత్రి నిద్రలో పదే పదే నీరు తాగుతారా..? ఇది వ్యాధని తెలుసుకోండి..!!

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: కొబ్బరి నూనె తింటే గుండె ఆరోగ్యానికి హానికరమా..? నిపుణులు ఇలా చెప్పారేంటి!!

(nails | Nails Care Tips | nails-tips | beautiful-nails | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | telugu-news)

Advertisment
తాజా కథనాలు