Chardham: చార్‌ధామ్ భక్తులకు బిగ్ అలర్ట్.. మరోసారి యాత్ర వాయిదా!

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్రను మరో 24 గంటలు వాయిదా వేశారు. భారీ వర్షాల హెచ్చరికలు ఉన్నందున యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర వాయిదా పడుతుందని అధికారులు తెలిపారు.

New Update
Chardham

Chardham

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్రను మరో 24 గంటలు వాయిదా వేశారు. భారీ వర్షాల హెచ్చరికలు ఉన్నందున యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. యాత్రికులను హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, వికాస్‌నగర్లలో నిలిపివేయాలని పోలీసులు, పరిపాలన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర వాయిదా పడుతుందని అధికారులు స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి:Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం

ఇది కూడా చూడండి:Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!

తొమ్మిది మంది గల్లంతు..

మరోవైపు, ఉత్తరకాశి జిల్లాలోని బార్కోట్-యమునోత్రి రోడ్డులోని సిలై బ్యాండ్‌లో క్లౌడ్ బరస్ట్ అయ్యింది. ఇక్కడ నిర్మాణంలో ఉన్న హోటల్ స్థలంలో నివసిస్తున్న తొమ్మిది మంది కార్మికులు గల్లంతయ్యారు. మొత్తం 19 మంది కార్మికుల్లో 10 మందిని సురక్షితంగా రక్షించగా, మిగిలిన 9 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చూడండి:ENG W vs IND W: భారత్ ఘన విజయం.. స్మృతి మంధాన రికార్డు సెంచరీతో ఇంగ్లాండ్‌ చిత్తు చిత్తు

ఇది కూడా చూడండి:Vivo X200 FE: వివో నుంచి అరాచకమైన ఫోన్.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే - ఫీచర్లు హైలైట్!

closed | kedarnath-yatra | kedarnath | chardham-yatra

Advertisment
తాజా కథనాలు