/rtv/media/media_files/2025/07/17/chia-seeds-2025-07-17-14-16-11.jpg)
Chia Seeds
నేటి కాలంలో బరువు తగ్గేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇంట్లోనే కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. ఆకలితో అలమటించకుండా బరువు తగ్గాలనుకుంటే.. చియా గింజలు బెస్ట్ ఆహారం. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చిన్న విత్తనాలలో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచడం ద్వారా ఆకలిని నియంత్రిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గటానికి ఇంటి చిట్కాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Also Read : బీహార్ ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. పెరోల్ ఖైదీ మృతి
ఉదయం ఖాళీ కడుపుతో చియా నీరు:
చియా నీరు కోసం1 టీస్పూన్ చియా గింజలను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇది జీవక్రియను పెంచుతుంది. కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. అంతేకాకుండా ఫ్రూట్ స్మూతీ, గ్రీన్ స్మూతీకి 2 టీస్పూన్ల చియా విత్తనాలను కలపాలి. ఇది స్మూతీని చిక్కగా చేయడమే కాకుండా ఫైబర్ కంటెంట్‌ను కూడా పెంచుతుంది. దీనికోసం 1 కప్పు పాలలో 2 టీస్పూన్ల చియా గింజలు, కొద్దిగా తేనె కలపాలి. రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. పండ్లతో అలంకరించి ఉదయం తినాలి. ఇది బరువు తగ్గడానికి రుచికరమైన మార్గం.
ఇది కూడా చదవండి: హెల్మెట్‌తో జుట్టు సమస్యలు.. కారణాలు తెలుసుకోండి
ఫ్రూట్ సలాడ్‌పై 1 టీస్పూన్ ఎండిన చియా విత్తనాలను చల్లుకోవాలి. ఇది రుచి మారకుండా ప్రోటీన్, ఒమేగా-3 లకు మంచి మూలంగా మారుతుంది. వడ్డించే ముందు వేడి సూప్, ఓట్స్ గంజిలో చియా విత్తనాలను కలపాలి. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది. రోజుకు 1-2 టీస్పూన్ల చియా గింజలు సరిపోతాయి. వాటిని నీటిలో నానబెట్టిన తర్వాత తినాలి. రోజంతా తగినంత నీరు తాగాలి. తద్వారా కడుపులో ఫైబర్ ఉబ్బి జీర్ణక్రియకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read : కేటీఆర్, కవితపై CIDకి ఫిర్యాదు
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పాపం అమాయకపు దొంగ.. దొంగతనానికి వెళ్లి..
(chia-seeds | chia-seeds-face | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | telugu-news)