Crime News: పాపం అమాయకపు దొంగ.. దొంగతనానికి వెళ్లి..

జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లా నోముండీలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చిన వ్యక్తి తన పని ముగిసిన తర్వాత పారిపోకుండా అక్కడే నిద్రపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Jharkhand Crime News

Jharkhand Crime News

Jharkhand Crime News: జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భూమ్ జిల్లా నోముండీ పట్టణంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా దొంగలు చోరీ చేశాక అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ ఘటనలో మాత్రం దొంగతనానికి వచ్చిన వ్యక్తి తన పని ముగిసిన తర్వాత పారిపోకుండా అక్కడే నిద్రపోయాడు. కాళీ దేవాలయంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశమైంది.

చోరీకి వచ్చి ఆలయంలోనే నిద్రపోయిన దొంగ..

వివరాల్లోకి వెళితే.. వీర్ నాయక్ అనే వ్యక్తి నోముండీ పట్టణంలోని కాళీ ఆలయంలోకి వెనుక తలుపు పగులగొట్టి ప్రవేశించాడు. ఆలయంలో ఉన్న పూజా సామగ్రి, ఆలంకార వస్తువులు, ఆభరణాలు, కిరీటం వంటి విలువైన వస్తువులను సంచిలో వేసుకున్నాడు. అయితే దొంగతనానికి ముందే అతను తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. మద్యం మత్తు వల్లే అతడు దొంగతనానికి వచ్చి ఉన్నట్లుండి అలసటకు లోనై అక్కడే పడుకొని నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలేచి పారిపోవాలనుకున్నాడో లేదో తెలియదు కానీ పూర్తిగా మత్తులో ఉండిపోయాడు.

ఇది కూడా చదవండి: ఎక్కువ ఉప్పుతో లక్షలాది మంది ప్రాణాలు గాలిలోకి.. షాకింగ్‌ విషయాలు ఇవే

ఉదయం ఆలయ పూజారి దేవస్థానానికి వచ్చి చూడగా.. వీర్ నాయక్ అక్కడే నిద్రలో ఉన్నాడు. అతడి దగ్గర చోరీ చేసిన వస్తువులతో కూడిన సంచి కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వీర్ నాయక్‌ను అరెస్ట్ చేశారు. అతడి నుంచి అన్ని విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా దొంగతనానికి ముందు మద్యం సేవించినట్టు అతడు ఒప్పుకున్నాడు. తాను మద్యం తాగి మత్తులో ఉన్నానని దొంగతనం చేసిన తర్వాత ఏమి జరిగిందో తెలియదని పోలీసులకు తెలిపాడు. ఎలా నిద్రపోయానో కూడా గుర్తు లేదని చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు వీర్ నాయక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

ఇది కూడా చదవండి: మహిళలు గర్భం గురించి తెలియకుండానే ప్రసవించగలదా..? ఇదిగో షాకింగ్‌ నిజాలు

crime news | Latest News | telugu-news | temple)

Advertisment
Advertisment
తాజా కథనాలు