/rtv/media/media_files/2025/07/16/hair-problems-and-helmet-2025-07-16-15-25-06.jpg)
Hair Problems and Helmet
Hair Problems: నేటి కాలంలో ఎంతో మంది జుట్టు రాలే సమస్యలతో బాధపడుతున్నారు. అయితే తాజాగా చేసిన సర్వేలో హెల్మెట్ నిరంతరం ధరించడం వల్ల జుట్టు రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది హెయిర్ స్టైలిస్టుల అభిప్రాయం ప్రకారం.. హెల్మెట్ ధరించడం వల్ల తలలో ఎక్కువ చెమట పడుతుంది. దీని కారణంగా జుట్టు మూలాలు బలహీనపడతాయి. దీనితోపాటు హెల్మెట్ తీసేటప్పుడు, ధరించేటప్పుడు జుట్టు లాగినప్పుడు.. అది కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణం కావచ్చు. హెల్మెట్ చాలా గట్టిగా ఉంటే, సరిగ్గా సరిపోకపోతే.. అది నిరంతరం జుట్టుకు సమస్యగా మారుతుంది. దీని కారణంగా జుట్టు విరుగుతుంది. కాలక్రమేణా అది రాలడం ప్రారంభమవుతుందని హెయిర్ స్టైలిస్టులు చెబుతున్నారు.
Also Read : ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ భేటీ
జుట్టును రక్షించుకోవడానికి సులభమైన చిట్కాలు:
- హెల్మెట్ నుంచి జుట్టును రక్షించుకోవడానికి.. జుట్టు, నెత్తిని శుభ్రంగా ఉంచుకోవడం, జుట్టులో చెమట, ధూళి పేరుకుపోకుండా సకాలంలో జుట్టును కడగడం ముఖ్యం.
- దీనితోపాటు జుట్టుకు నూనె రాయడం మర్చిపోకూడదు. ప్రతి వారం 2,3 సార్లు షాంపూతో తలస్నానం చేసే ముందు నూనె రాయడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది. ఇది హెల్మెట్ ప్రభావాల నుంచి జుట్టును రక్షించడంలో సహాయపడుతుంది.
- తడి జుట్టు మీద హెల్మెట్ ధరించకూడదు. నిజానికి తడి జుట్టు మీద హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు విరిగిపోతుంది. తలపై చుండ్రు ఏర్పడుతుంది. ఎల్లప్పుడూ హెల్మెట్ కింద కాటన్ క్యాప్ ధరించాలి. తేలికపాటి కాటన్ క్యాప్ చెమటను గ్రహిస్తుంది. ఇది జుట్టు లాగడాన్ని నిరోధిస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
- సరైన సైజులో హెల్మెట్ ధరించడం ముఖ్యం. తలకు సౌకర్యవంతంగా సరిపోయే, చాలా బిగుతుగా లేని హెల్మెట్‌ను ధరించాలి. హెల్మెట్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే హెల్మెట్ లోపల పేరుకుపోయిన చెమట, ధూళి, బ్యాక్టీరియా జుట్టును దెబ్బతీస్తాయి.
- హెల్మెట్‌ను తల నుంచి నెమ్మదిగా తొలగించాలి. అకస్మాత్తుగా తల నుంచి హెల్మెట్‌ను తీసివేస్తే.. జుట్టు మూలాల నుంచి బయటకు రావచ్చు. ఇది జుట్టుకు హాని కలిగించవచ్చు.
- ఇతరుల హెల్మెట్లు ధరించకూడదు ఎందుకంటే ఇది తలపై చర్మం ఇన్ఫెక్షన్, చుండ్రు లేదా జుట్టు రాలడం వంటి ప్రమాదాన్ని పెంచుతుంది. వారానికి ఒకసారి జుట్టుకు కలబంద జెల్‌ను రాయలి. కలబంద జెల్ తల చర్మాన్ని చల్లబరుస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
Also Read : కుక్క గోళ్ల గీతల వల్ల రేబిస్ వస్తుందా..? ప్రాణాంతక వ్యాధి నిజాలు ఇవే
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: తలనొప్పి-నుదురులో తీవ్రమైన వ్యాధికి సంకేతాలు.. ఇవి తెలుసుకోండి
ఇది కూడా చదవండి: లాక్టోస్ అసహనం ఉందో లేదో ఇలా తెలుసుకోండి.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..!!
(helmet | problems | Health Tips | health tips in telugu | latest health tips | best-health-tips | Latest News | telugu-news)