Health Issues: అతిగా ఉప్పు తీసుకోవడం మానేస్తే.. సగం జబ్బులు మీకు తగ్గినట్లే!

ఉప్పును లిమిట్‌లో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువగా తీసుకున్నా.. ఎక్కువగా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు అంటున్నారు. రక్తపోటు, గుండె జబ్బులు, కిడ్నీ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
Salt

Salt

కూరలు రుచిగా ఉండాలంటే ఉప్పు తప్పనిసరి. అయితే ఉప్పును లిమిట్‌లో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువగా తీసుకున్నా.. ఎక్కువగా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అవేంటో తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయాల్సింది. 

సోడియం స్థాయిలు అధికంగా పెరిగితే..

ఉప్పు(salt) అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు(blood pressure), గుండె జబ్బులు(heart problems), కిడ్నీ(kidney) వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మూత్ర విసర్జనకు ఎక్కువగా వెళ్తుంటారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎక్కువగా టాయిలెట్ వెళ్తుంటే మాత్రం ఆహారంలో ఉప్పు వాడకం కాస్త తగ్గించండి. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. ఫలితంగా శరీరంలో నీటి స్థాయిలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో ఎక్కువగా దాహం వేస్తుంది. దీంతో వాటర్ అధికంగా తాగడంతో మూత్ర విసర్జన చేస్తారని నిపుణులు అంటున్నారు. హైబీపీ అధికంగా ఉన్నవారికి శరీర భాగాల్లో వాపు కనిపిస్తుంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఇది ఇంకా కనిపిస్తుంది. అధిక ఉప్పు వల్ల పాదాల్లో నీటి నిల్వ పెరిగిపోయి ఉబ్బుతాయి. అదే మీరు ఉప్పు తీసుకోవడం తగ్గిస్తే ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Energy Drinks: రోజుకు శక్తినిచ్చే అద్భుతమైన పానీయాలు.. ఉదయాన్నే వీటిని తాగితే ఆరోగ్యమే ఆరోగ్యం!!

అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల ఎలాంటి టేస్ట్ ఉండదు. ఎంత టేస్టీ ఫుడ్ తీసుకున్నా కూడా నోటికి నచ్చదని నిపుణులు అంటున్నారు. వీరు ఎక్కువ ఉప్పుగా ఉన్న ఆహార పదార్థాలనే తింటుంటారు. అయితే మోతాదుకు మంచి ఉప్పు తీసుకోవడం వల్ల కాల్షియం స్థాయిల మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. దీనివల్ల తిమ్మిర్లు, నొప్పులు వంటి సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఏదో విధంగా ఉప్పును తగ్గించుకుంటే సగం జబ్బులు తగ్గినట్లేనని నిపుణులు చెబుతున్నారు. అయితే బయట సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేసే కొన్ని పదార్థాల్లో ఉప్పు కాస్త ఎక్కువగా ఉంటుంది. వీటిని కాస్త తగ్గిస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: Tea And Cigarette Side Effects: జాగ్రత్త బాసూ.. టీ, సిగరెట్ కలిపి తాగుతున్నారా?.. పిల్లలు పుట్టడం కష్టమే..!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు