Tea And Cigarette Side Effects: జాగ్రత్త బాసూ.. టీ, సిగరెట్ కలిపి తాగుతున్నారా?.. పిల్లలు పుట్టడం కష్టమే..!

టీ, సిగరెట్ కలిపి తీసుకోవడం వలన గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదం 30% వరకు పెరుగుతుంది. రక్తపోటు పెరిగి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే జీర్ణ సమస్యలు, అల్సర్లు, వంధ్యత్వం వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
Health side effects of tea and cigarette combination

Health side effects of tea and cigarette combination

నేటి ఆధునిక జీవనశైలిలో చాలా మంది ఉదయం లేవగానే లేదా సాయంత్రం పని వేళలో అలసటగా అనిపించి టీ లేదా కాఫీ తాగడానికి ఇష్టపడతారు. ఈ అలవాటు సాధారణమే అయినప్పటికీ.. టీ(Tea Side Effects) తాగుతూ సిగరెట్ కాల్చే ప్రమాదకరమైన అలవాటును కొందరు కలిగి ఉంటారు. ఇది ఒక 'స్టైల్' లేదా 'రిలాక్సేషన్'గా భావిస్తారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం.. ఈ రెండింటి కలయిక మన శరీరానికి తీవ్రమైన హానిని కలిగిస్తుంది. సిగరెట్‌లో ఉండే నికోటిన్, టీలోని కెఫిన్ కలిసి పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యల తీవ్రత భారీగా పెరుగుతుంది. ఈ అలవాటు మన ఊపిరితిత్తులు, గుండె, జీర్ణవ్యవస్థపై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపిస్తుంది. దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం. ఈ డెడ్లీ కాంబినేషన్ వల్ల కలిగే ఆరోగ్య నష్టాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 

Also Read :  శిక్షించకుండా ఇలా సరిదిద్దండి.. పిల్లలను పెంచడంలో అసలు రహస్యాలు ఇవే!!

Tea And Cigarette Side Effects

క్యాన్సర్ ప్రమాదం పెరుగుదల:

సిగరెట్‌లోని హానికరమైన రసాయనాలు.. మరీ ముఖ్యంగా నికోటిన్ ఊపిరితిత్తుల కణాలను దెబ్బతీస్తాయి. టీతో కలిపి సిగరెట్ తీసుకోవడం వలన అన్నవాహిక (Esophageal Cancer) క్యాన్సర్ వచ్చే ప్రమాదం 30 శాతం వరకు పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. వేడి టీ.. అన్నవాహిక కణాలను దెబ్బతీయడం, సిగరెట్ పొగలోని రసాయనాలు ఆ నష్టాన్ని మరింత పెంచడం వలన గొంతు, నోటి క్యాన్సర్ల ముప్పు కూడా పెరుగుతుంది.

గుండె, రక్తనాళాల సమస్యలు

టీలోని కెఫిన్, సిగరెట్‌లోని నికోటిన్ కలయిక గుండె స్పందన రేటును (Heart Rate) బాగా పెంచుతుంది. ఈ కలయిక రక్తనాళాలు కుంచించుకుపోయేలా చేసి, అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. దీని ఫలితంగా గుండెపోటు (Heart Attack), స్ట్రోక్ వచ్చే ప్రమాదం అధికమవుతుంది.

జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం

టీలోని కెఫిన్ కడుపులో ఆమ్లాన్ని పెంచుతుంది. సిగరెట్ పొగ కూడా జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ రెండింటి కలయిక వల్ల అజీర్ణం, మంట, కడుపు నొప్పి, కడుపు పూతలు వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

నాడీ, మానసిక సమస్యలు

ఈ కాంబినేషన్ మెదడుకు హాని కలిగించవచ్చు. దీని వలన జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత లోపించడం, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి.

Also Read :  ధంతేరాస్ నాడు పొరపాటున వీటిని ఇంటికి తీసుకొచ్చారో.. కటిక పేదరికం తప్పదు

ఇతర ఆరోగ్య నష్టాలు

వంధ్యత్వం/సంతానలేమి

మగవారిలో శుక్రకణాల నాణ్యత క్షీణిస్తుంది. స్త్రీలలో అండాశయాల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపడం వలన సంతానలేమి సమస్యలు పెరుగుతాయి.

ఎముకల బలహీనత

సిగరెట్, టీలోని కొన్ని రసాయనాలు ఎముకలను బలహీనపరుస్తాయి. బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.

రోగనిరోధక శక్తి తగ్గుదల 

శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి చిన్నపాటి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువ.

Advertisment
తాజా కథనాలు