/rtv/media/media_files/2025/10/15/garlic-lemon-water-2025-10-15-10-06-34.jpg)
Garlic Lemon Water
ప్రతి రోజు ఉదయం సరైన పద్ధతిలో ప్రారంభిస్తే.. ఆ రోజంతా ఉత్తేజంగా, శక్తివంతంగా ఉంటారు. ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రం ప్రకారం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం వలన శరీరం డిటాక్సిఫై అవుతుంది. జీవక్రియ (మెటబాలిజం) పెరగటంతోపాటు రోగనిరోధక శక్తి బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, అద్భుతమైన మార్పులను అందించే మూడు శక్తివంతమైన పానీయాల గురించి ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
నిమ్మకాయ నీరు (Lemon Water)
ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం అనేది శరీరాన్ని సహజంగా డిటాక్సిఫై చేయడానికి సులభమైన మార్గం. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. పరిశోధనల ప్రకారం.. నిమ్మకాయ నీరు జీవక్రియను వేగవంతం చేస్తుంది.. తద్వారా కొవ్వును కరిగించే ప్రక్రియ మెరుగుపడుతుంది. ఇది శరీరంలో pH సమతుల్యతను కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఈ పానీయం పొట్టను శుభ్రం చేసి.. మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: మహిళల్లో పెరుగుతున్న ఊబకాయం వెనుక దాగున్న వాస్తవాలు ఇవే!!
మునగ నీరు (Moringa Water)
మునగ (Moringa) నీరు తాగడం వలన శరీరానికి శక్తి లభిస్తుంది, రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మునగ నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరం. ఇది కాలేయాన్ని (Liver) శుద్ధి చేసి.. శరీరంలోని వాపు (Inflammation)ను తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది.
వెల్లుల్లి నీరు (Garlic Water)
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఈ పానీయం శరీరాన్ని డిటాక్సిఫై చేయడమే కాక, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గించి.. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఈ మూడు పానీయాలలో ఏదో ఒకదానితో రోజును ప్రారంభించడం ద్వారా రోజంతా చురుకుగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఉదయం అలసిపోతున్నారా..? నిద్రను పాడుచేసే చెడు అలవాట్ల గురించి తెలుసుకోండి!!