Nightmares: ఏసీ గదుల్లో పడుకుంటే పీడకలలు నిజంగానే వస్తాయా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

శరీరానికి చాలా చలిగా అనిపించినప్పుడు.. మెదడు అసౌకర్యంగా భావిస్తుంది. ఇది నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. ఏసీ వల్ల శరీరం రిలాక్స్ అయినా, మానసిక ఒత్తిడి, చల్లని నిద్ర కలిపి పీడకలలను ప్రేరేపించవచ్చు. ప్రతిసారీ పీడకలలకు ఏసీనే కారణం కాదు.

New Update
Nightmares

Nightmares

ఎయిర్ కండిషనర్ (AC) అనేది గదిలోని గాలి ఉష్ణోగ్రతను, తేమను నియంత్రించే ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ముఖ్యంగా వేసవి కాలం(Summer) లో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది బయటి వేడి గాలిని లోపలికి రాకుండా నిరోధిస్తుంది. గది లోపల ఉండే వేడి గాలిని చల్లబరుస్తుంది. ACలో ప్రధానంగా కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్‌పాన్షన్ వాల్వ్, ఎవాపరేటర్ ఉంటాయి. ఈ భాగాలన్నీ కలిసి పనిచేసి ఒక శీతలీకరణ చక్రం ద్వారా గదిని చల్లబరుస్తాయి. ఫలితంగా మనకు సౌకర్యవంతమైన వాతావరణం లభిస్తుంది. గదిలో ఏసీ చాలాసేపు నడిస్తే.. తాజా గాలి ప్రవాహం తగ్గుతుంది. ఇది మెదడుపై ప్రభావం చూపి నిద్రలో చెడు, భయంకరమైన కలలు వచ్చేందుకు కారణం కావచ్చు. దాని గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

మానసిక ఒత్తిడి, చల్లని నిద్ర కలిపి పీడకలు..

ఎయిర్ కండిషనర్‌ను చాలామంది మంచి నిద్ర కోసం ఆశ్రయిస్తుంటారు. ఏసీ గదిలో చల్లని గాలి నిద్రకు ఉపశమనం ఇస్తుంది. కానీ కొందరు  ఏసీలో పడుకున్నప్పుడు వింతగా, భయంకరమైన కలలు వస్తున్నాయని చేబుతూ ఉంటారు. అయితే ఏసీకి, పీడకలలకు మధ్య నిజంగా ఏదైనా సంబంధం ఉందా? ఈ డౌట్ చాలా మందిలో ఉంటుంది. నిద్రకు మన శరీర ఉష్ణోగ్రత, పరిసరాలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఏసీ గది ఉష్ణోగ్రతను తగ్గించి, నిద్ర త్వరగా రావడానికి సహాయపడుతుంది. కానీ ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటే.. శరీరం అసాధారణంగా ప్రతిస్పందిస్తుంది. ఇది మెదడులోని REMను ప్రభావితం చేస్తుంది. ఇది మనం కలలు కనే దశ. శరీరానికి చాలా చలిగా అనిపించినప్పుడు.. మెదడు అసౌకర్యంగా భావిస్తుంది. ఇది నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. ఏసీ వల్ల శరీరం రిలాక్స్ అయినా, మానసిక ఒత్తిడి, చల్లని నిద్ర కలిపి పీడకలలను ప్రేరేపించవచ్చు. ప్రతిసారీ పీడకలలకు ఏసీనే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: భారతదేశంలో ఒక చట్టబద్ధమైన హక్కు

కొన్నిసార్లు ఒత్తిడి, డిప్రెషన్, అర్థరాత్రి వరకు మొబైల్ వాడటం, ఆలస్యంగా తినడం, పడుకోవడానికి ముందు భారీ భోజనం చేయడం కూడా కారణాలు కావచ్చు. రోజూ ఏసీలో పడుకుని, తరచుగా చెడు కలలు(nightmares) చూస్తుంటే.. అందుకు మీ గదిలోని వాతావరణం కూడా ఒక కారణం కావచ్చని అంటున్నారు. మెరుగైన నిద్ర కోసం ఏసీ ఉష్ణోగ్రతను 26 డిగ్రీల వరకు సెట్ చేయాలి. పడుకునేటప్పుడు గదిలో కొద్దిగా గాలి వచ్చేలా చూసుకోవాలి. రాత్రిపూట భారీ భోజనం, కెఫిన్‌కు దూరంగా ఉండాలి. పడుకునే ముందు రిలాక్సింగ్ మ్యూజిక్ వినడం, మెడిటేషన్ చేయడం, పుస్తకం చదవడం వంటి అలవాట్లు చేసుకోవాలి. ఏసీ గదికి పీడకలలకు మధ్య సంబంధం ఉండవచ్చు. కానీ ఇది అందరికీ వర్తించదు. చాలా సందర్భాల్లో సమస్యకు కారణం సరికాని ఉష్ణోగ్రత సెట్టింగ్ లేదా మానసిక ఒత్తిడి. మీరు కూడా ఏసీలో పడుకునేటప్పుడు పీడకలల వల్ల తరచుగా ఇబ్బంది పడుతుంటే.. వైద్యుని సలహా మేరకు  నిద్ర వాతావరణాన్ని సమతుల్యం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఫ్లైవనాయిడ్ల వినియోగంతో ఆరోగ్యం మెరుగు.. పరిశోధనలు ఏం చెపుతున్నాయో మీరూ తెలుసుకోండి!

Advertisment
తాజా కథనాలు