Health Tips: ఫ్లైవనాయిడ్ల వినియోగంతో ఆరోగ్యం మెరుగు.. పరిశోధనలు ఏం చెపుతున్నాయో మీరూ తెలుసుకోండి!

టీ, బెర్రీలు, డార్క్ చాక్లెట్, యాపిల్స్ వంటి ఫ్లేవనాయిడ్లు పుష్కలం. ఈ ఆహారాలను వివిధ రకాలుగా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రోజుకు సుమారు 500 మి.గ్రా ఫ్లేవనాయిడ్లను తీసుకోవడం వల్ల అన్ని రకాల మరణాల ప్రమాదం తగ్గుతుంది.

New Update
dark chocolate

Tea And Berries

టీ, బెర్రీలు, డార్క్ చాక్లెట్, యాపిల్స్ వంటి ఫ్లేవనాయిడ్లు పుష్కలం. ఈ ఆహారాలను వివిధ రకాలుగా తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఫ్లేవనాయిడ్లు కేవలం అధిక మొత్తంలో తీసుకోవడం మాత్రమే కాకుండా.. వాటిలోని వైవిధ్యం కూడా చాలా ముఖ్యమని పరిశోధనలో కనుగొన్నారు. ఈ పరిశోధన ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసీజ్, క్యాన్సర్, న్యూరోలాజికల్ వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో ఫ్లేవనాయిడ్లు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిశోధనలో 40 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లపై పరిశీలించారు. రోజుకు సుమారు 500 మి.గ్రా ఫ్లేవనాయిడ్లను తీసుకోవడం వల్ల అన్ని రకాల మరణాల ప్రమాదం 16% తగ్గుతుందని చెబుతున్నారు. 

వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుంది:

అంతేకాకుండా, సివిడి, టైప్ 2 డయాబెటిస్, శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం కూడా దాదాపు 10% తగ్గుతుంది. ఈ 500 మి.గ్రా అనేది సుమారు రెండు కప్పుల టీ తాగితే లభించే ఫ్లేవనాయిడ్ల మొత్తానికి సమానమని తెలిపారు. అయితే కేవలం అధిక మొత్తంలో ఫ్లేవనాయిడ్లను తీసుకోవడం కంటే.. వివిధ రకాల ఫ్లేవనాయిడ్లను తీసుకునేవారిలో వ్యాధుల ప్రమాదం ఇంకా తక్కువగా ఉందని నిపుణులు పేర్కొన్నారు. అందుకే కేవలం ఒకే ఆహారం నుంచి ఫ్లేవనాయిడ్లను పొందడం కంటే.. వివిధ రకాల ఫ్లేవనాయిడ్లు ఉండే ఆహారాలను తినడం మంచిది. వివిధ ఫ్లేవనాయిడ్లు వివిధ రకాలుగా పని చేస్తాయి. కొన్ని రక్తపోటును మెరుగుపరుస్తాయి, మరికొన్ని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, వాపును తగ్గిస్తాయి.

ఇది కూడా చదవండి: ఇంట్లోనే ఈ చిన్న పరీక్షతో బ్రెయిన్ ట్యూమర్‌ను గుర్తించొచ్చు.. ఎలా చేయాలో తెలుసా?

ఈ అధ్యయనం ఒకే మూలం నుంచి ఫ్లేవనాయిడ్లను తీసుకోవడం కంటే.. ఎక్కువ పరిమాణంలో విస్తృత రకాలుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిరూపించింది. మన రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచిస్తోంది. కేవలం టీ లేదా ఒక రకమైన పండు మాత్రమే కాకుండా.. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, టీ, ఇతర ఫ్లేవనాయిడ్లు ఉండే ఆహారాలను తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు, మధుమేహం, ఇతర వ్యాధులను నివారించవచ్చు. ఈ అధ్యయనం ప్రకారం.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి.. కేవలం ఫ్లేవనాయిడ్ల మొత్తాన్ని మాత్రమే కాకుండా.. వాటి వైవిధ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: కాళ్లల్లో నొప్పి, గుండెకు సంబంధం ఏంటి?: ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Advertisment
తాజా కథనాలు