Alimony: భారతదేశంలో ఒక చట్టబద్ధమైన హక్కు

భారతదేశంలో భరణంపై ప్రధాన చట్టబద్ధమైన హక్కుగా స్వాతంత్ర్యం తర్వాతే వచ్చాయి. హిందూ మతాచారాలలో భార్యను పోషించడం భర్త బాధ్యతగా భావించేవారు. భారతదేశంలో భరణానికి సంబంధించిన ముఖ్య చట్టమైన చట్టాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.

New Update
Alimony

Alimony

విడాకులు(Divorce) లేదా విడిపోయిన తర్వాత జీవిత భాగస్వామి(Life Partner) కి ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి మరొక జీవిత భాగస్వామి ఇచ్చే మొత్తాన్ని "భరణం" (Alimony) అని అంటారు. ఇది ఆర్థికంగా బలహీనమైన భాగస్వామి తమ జీవితాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. భారతదేశంలో భరణం అనేది ఒక చట్టబద్ధమైన హక్కు మరియు వివిధ మతాలకు సంబంధించిన చట్టాల కింద ఇది వర్తిస్తుంది. సాధారణంగా వివాహానంతరం మహిళలు ఇంటి బాధ్యతల కోసం, పిల్లల సంరక్షణ కోసం తమ ఉద్యోగాలను లేదా వృత్తిని వదిలిపెడతారు. అలాంటి సందర్భంలో వారు భర్తపై ఆర్థికంగా ఆధారపడుతారు. ఏదైనా కారణం వల్ల విడాకులు తీసుకుంటే.. ఆ మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడం భరణం ప్రధాన ఉద్దేశ్యం. అయితే.. భర్త ఆర్థికంగా బలహీనంగా ఉండి, భార్య అధిక ఆదాయం కలిగి ఉంటే.. భర్త కూడా భరణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read :  తమిళనాడులో డీఎంకే వర్సెస్‌ టీఎంకే..అంకుల్‌..బ్రో అంటూ పోస్టర్ వార్‌..

భారతదేశంలో భరణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన చట్టాలు:

 * హిందూ వివాహ చట్టం 1955: ఈ చట్టం కింద హిందూ మతానికి చెందిన భార్య లేదా భర్త భరణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చట్టంలోని సెక్షన్ 24, 25 భరణానికి సంబంధించిన విషయాలను వివరిస్తాయి.
 * ముస్లిం మహిళా చట్టం (విడాకుల హక్కుల పరిరక్షణ), 1986: ఈ చట్టం ముస్లిం మహిళలకు వర్తిస్తుంది. విడాకుల తర్వాత భరణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది.
 * ప్రత్యేక వివాహ చట్టం, 1954: ఈ చట్టం ప్రకారం వివాహం చేసుకున్నవారికి ఈ చట్టం వర్తిస్తుంది.
 * భారతీయ విడాకుల చట్టం,1869: క్రైస్తవులకు ఈ చట్టం వర్తిస్తుంది.

భరణాన్ని నిర్ణయించడానికి కోర్టుల అంశాలు:

 * భార్యాభర్తల ఆర్థిక స్థితి: ఇద్దరి ఆదాయం, ఆస్తులు మరియు అప్పులు.
 * జీవన శైలి: వివాహం సమయంలో వారి జీవన ప్రమాణం ఎలా ఉంది.
 * భవిష్యత్ అవసరాలు: భార్య, పిల్లల భవిష్యత్ అవసరాలు.
 * పిల్లల సంరక్షణ: పిల్లల పోషణ, విద్య ఖర్చులు.
 * భార్య సంపాదన సామర్థ్యం: భార్య ఉద్యోగం చేస్తుందా లేదా భవిష్యత్తులో సంపాదించే అవకాశం ఉందా.

భారతదేశం(India) లో భరణం(Dowry) అనే భావన ప్రాచీన కాలం నుంచే ఉన్నప్పటికీ.. చట్టబద్ధమైన హక్కుగా దీనికి సంబంధించిన ప్రధాన చట్టాలు స్వాతంత్ర్యం తర్వాతే వచ్చాయి. హిందూ మతాచారాలలో భార్యను పోషించడం భర్త బాధ్యతగా భావించేవారు. భారతదేశంలో భరణానికి సంబంధించిన ముఖ్య చట్టమైన హిందూ వివాహ చట్టం, 1955, హిందూ దత్తతల,   భరణ పోషణముల చట్టం, 1956లో భరణానికి సంబంధించిన నిబంధనలు పొందుపరచబడ్డాయి. ఈ చట్టాలు ఆస్తిలో కూడా భార్యకు హక్కును కల్పించాయి. తర్వాత కాలంలో.. వివిధ మతాల వారికి సంబంధించిన చట్టాలు రూపొందించబడ్డాయి. సుప్రీంకోర్టు కూడా భరణంపై అనేక మార్గదర్శకాలను జారీ చేస్తూ.. నిస్సహాయ స్థితిలో ఉన్న భాగస్వామికి ఆర్థిక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. అయితే భరణం అనేది భర్తను దోచుకోవడం కాదని.. ఇది ఒక న్యాయమైన జీవనానికి సహాయం మాత్రమేనని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భార్యాభర్తలిద్దరూ తమ స్థితిగతులను బట్టి న్యాయమైన భరణాన్ని నిర్ణయించాలని కోర్టులు సూచిస్తున్నాయి.

ఇది కూడా చదవండి:  మిస్టరీ ఆలయం.. ఇందులోకి వెళ్తే మాట్లాడరు.. చూడరు.. ఇంతకీ ఎక్కడంటే?

Advertisment
తాజా కథనాలు