Sinusitis: తలనొప్పిని జలుబు అని పొరపడకండి.. అది సైనసైటిస్ కావొచ్చు!!

నిరంతరం ముక్కు మూసుకుపోయి ఉంటే అధి తలనొప్పి, జలుబుగా మారితుంది. అయితే అది సైనసైటిస్ అనే సమస్య తలెత్తుతుంది. ఈ వ్యాధి లక్షణాలు ఇన్ఫెక్షన్ సోకిన సైనస్ గదిని బట్టి, చెంపలు, నుదురు భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుందని చెబుతున్నారు.

New Update
headache and Sinusitis

headache and Sinusitis

చల్లని వాతావరణం, కాలుష్యం వంటి కారణాల వల్ల ముక్కు, కళ్ళ చుట్టూ ఉండే సైనస్ గదుల్లో వాపు (inflammation) వచ్చి సైనసైటిస్ అనే సమస్య తలెత్తుతుంది. ఈ గదులు సాధారణంగా గాలితో నిండి ఉంటాయి. కానీ ఇన్ఫెక్షన్ సోకితే వీటిలో శ్లేష్మం (mucus) పేరుకుపోయి నొప్పి, ఒత్తిడిని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిరంతరం ముక్కు మూసుకుపోయి ఉండటం.. తలనొప్పి(headache) ని జలుబుగా మారితే అది సైనసైటిస్ గా ఎందుకు అవుతుందో.. వాటిని నివారించే మార్గాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

సైనసైటిస్ రావడానికి కారణాలు:

ఈ వ్యాధి లక్షణాలు ఇన్ఫెక్షన్ సోకిన సైనస్(sinusitis) గదిని బట్టి మారుతాయి. చెంపలు, పై దవడ పళ్ళు నొప్పిగా ఉంటాయి, నుదురు భాగంలో తీవ్రమైన నొప్పి, కళ్ళ మధ్య భాగంలో నొప్పి,  తల వెనుక భాగం, మెడలో నొప్పి వీటితోపాటు, ముక్కు దిబ్బడ, వాసన పసిగట్టే సామర్థ్యం తగ్గడం, తలనొప్పి, ముఖంపై ఒత్తిడి, కొన్నిసార్లు జ్వరం కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే సైనసైటిస్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో దుమ్ము, పొగ, పుప్పొడి (pollen) వంటి వాటికి అలర్జీలు, వైరల్, బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ముక్కులోని ఎముక వంకరగా ఉండడం, బలహీనమైన రోగనిరోధక శక్తి, ఒత్తిడి, అస్తవ్యస్తమైన జీవనశైలి ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: మల విసర్జన సమయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కాలేయం దెబ్బతిన్నట్లే

ఆయుర్వేదం ప్రకారం సైనసైటిస్‌కు కొన్ని సులభమైన ఇంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆవ నూనె లేదా నెయ్యిని ఉదయం, సాయంత్రం రెండు చుక్కల చొప్పున ముక్కులో వేసుకోవడం, వేడి నీటిలో వాము (carom seeds) లేదా పుదీనా వేసి ఆవిరి పట్టడం, తులసి, అల్లం కలిపి కషాయం చేసుకోవడం, పసుపు వేసిన పాలు, త్రికటు చూర్ణం తీసుకోవడం వల్ల కఫం, శ్లేష్మం తగ్గి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. వీటితోపాటు ఈ సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దుమ్ము, ధూళి, కాలుష్యం నుంచి దూరంగా ఉండటం, చల్లని వాతావరణంలో తగిన దుస్తులు ధరించటం, వేయించిన, నూనె పదార్థాలు, చల్లని పానీయాలకు దూరంగా ఉండటం, తేలికైన, పౌష్టిక ఆహారం తీసుకోవటం వంటి చేయాలి. ఇంకా క్రమం తప్పకుండా యోగ, ప్రాణాయామం చేయడం వల్ల శ్వాస వ్యవస్థ బలంగా మారి, రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: నడుము నుంచి పాదాల వరకు తీవ్రమైన నొప్పా..? విస్మరిస్తే జీవితాంతం సమస్యలు తప్పవు!!

Advertisment
తాజా కథనాలు