Ajwain Leaves Tea: అజ్వైన్ టీ ఎప్పుడు తాగాలి..? తాగితే కలిగే ప్రయోజనాల గురించి డైటీషియన్ ఏం చెబుతున్నారో తెలుసుకోండి!!

ఉదయం ఖాళీ కడుపుతో వాము ఆకు టీ తాగడం వలన పొట్ట శుభ్రపడుతుంది, మంట తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రాత్రి భోజనం తర్వాత తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, కడుపులో భారంగా అనిపించడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని డైటీషియన్లు చేబుతున్నారు.

New Update
ajwain leaves tea

Ajwain Leaves Tea

భారతీయ వంటగదిలో వాము (Celery/Ajwain) ఒక ముఖ్యమైన మసాలా. ఇది ఆహారానికి రుచిని ఇవ్వడమే కాక.. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అయితే వాము గింజలే కాకుండా.. దాని ఆకులు కూడా అంతే ప్రయోజనకరమని చాలామందికి తెలియదు. ఆరోగ్య నిపుణులు వాము ఆకులతో తయారు చేసిన టీ తాగాలని సిఫార్సు చేస్తున్నారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం.. వాము ఆకు టీ(ajwain-leaves) ని రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు.. కానీ కొన్ని సమయాల్లో తాగితే మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. - best-health-tips

తక్షణ ఉపశమనం కోసం ఈ టీ బెస్ట్:

ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వలన పొట్ట శుభ్రపడుతుంది, మంట తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రాత్రి భోజనం తర్వాత తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, కడుపులో భారంగా అనిపించడం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా తలనొప్పి లేదా మైగ్రేన్‌తో బాధపడుతున్నప్పుడు వేడిగా తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. అల్లంతో వాము ఆకు టీ తయారు చేసే విధానం. అల్లంతో కలిపి వాము ఆకు టీ చేసుకోవాలని డైటీషియన్లు సిఫార్సు చేస్తున్నారు. ఈ టీ కోసం ముందుగా ఒక గ్లాసు నీటిని మరిగించాలి. కొన్ని తాజా వాము ఆకులను తీసుకుని.. శుభ్రం చేసి రసం తీయడం లేదా కొద్దిగా నలపాలి. చిన్న అల్లం ముక్కను కూడా శుభ్రం చేసి.. కొద్దిగా దచ్చి వాటిని మరుగుతున్న నీటిలో వేసి కొద్దిసేపు మరిగించాలి. నీరు సగానికి తగ్గిన తరువాత.. మంట ఆపి వడకట్టి వేడిగా తాగాలి.

ఇది కూడా చదవండి: బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుందా..! వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి!!

వాము, అల్లం రెండూ సహజ నొప్పి నివారణులు. వీటి కలయిక మైగ్రేన్, తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది. అంతేకాకుండా ఈ టీ అద్భుతమైన మనస్సు రిలాక్సెంట్‌గా పనిచేస్తుంది. దీని వెచ్చని ప్రభావం మనస్సును ప్రశాంతపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది గ్యాస్, ఎసిడిటీ,   ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు ప్రేగులలోని హానికరమైన పురుగులను చంపి.. ఆరోగ్యకరమైన గట్‌ను నిర్వహించడానికి సహాయపడతాయి. వాము ఆకు రసం మూత్రపిండాలను శుభ్రపరచడానికి సహాయపడుతుంది, కిడ్నీ స్టోన్స్ నుంచి కూడా కొంత ఉపశమనం ఇస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా వాము, అల్లం రెండింటిలోనూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  వాము ఆకు టీని రోజువారీ తీసుకోవడం వలన ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: శీతాకాలంలో వేడి నీళ్లను తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి!!

Advertisment
తాజా కథనాలు